Kumbh Mela: మహా కుంభమేళాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా పేరొందిన మహా కుంభమేళాలో (Kumbh Mela) సోమవారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు.
ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో ఆమె పవిత్ర స్నానం ఆచరించారు.
రాష్ట్రపతి పర్యటనను దృష్టిలో ఉంచుకుని, మహా కుంభమేళా ప్రాంగణంలో భద్రతను మరింత కట్టుదిట్టంగా నిర్వహించారు.
ప్రయాగ్‌రాజ్ చేరుకున్న రాష్ట్రపతికి ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హృదయపూర్వక స్వాగతం పలికారు.
అనంతరం, వారితో కలిసి ద్రౌపదీ ముర్ము బోటు ప్రయాణం చేశారు. ఈ ప్రయాణంలో ఆమె వలస పక్షులకు ఆహారం అందజేశారు.
ఆ తర్వాత త్రివేణి సంగమం వద్దకు చేరుకుని పవిత్ర స్నానం ఆచరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వివరాలు
44 కోట్ల మంది పుణ్యస్నానం
144 ఏళ్లకోసారి జరిగే మహా కుంభమేళా ఈ సంవత్సరం జనవరి 13న ప్రారంభమైంది.
ఈ మహోత్సవానికి భారత్‌తో పాటు అనేక విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు హాజరవుతున్నారు.
ఈ వేడుకలు ఫిబ్రవరి 26 వరకు కొనసాగనున్నాయి. ఇప్పటి వరకు వివిధ రంగాలకు చెందిన రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సామాన్య భక్తులు కలిపి మొత్తం 44 కోట్ల మంది పుణ్యస్నానం ఆచరించారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
త్రివేణీ సంగమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
#WATCH | Prayagraj, UP: President Droupadi Murmu takes a holy dip at Triveni Sangam during the ongoing Maha Kumbh Mela. pic.twitter.com/2PQ4EYn08b
— ANI (@ANI) February 10, 2025