
Mann Ki Baat: ప్రధాని మోదీ 'మన్ కీ బాత్' ప్రోగ్రాం.. మరో మైలురాయి దిశగా ముందుకు!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిమాసం నిర్వహించే 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమం మరో అరుదైన ఘనత సాధించనుంది.
2014లో ప్రారంభించిన ఈ కార్యక్రమం మూడు రోజుల్లో దశాబ్దంలోకి ప్రవేశించనుంది. ఈరోజు 114వ ఎపిసోడ్ ప్రసారం కానుంది.
ఇది 'మన్ కీ బాత్' ప్రోగ్రామ్‌కి ప్రత్యేకమైన సందర్భాన్ని సృష్టిస్తోంది. మోదీ తన ఈ ఐకానిక్ ప్రోగ్రామ్ గురించి ఎక్స్ వేదికలో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.
ఇవాళ #MannKiBaat ప్రత్యేకమైనదని, ఈ కార్యక్రమం పదేళ్లలోకి అడుగుపెడుతోందని చెప్పారు. నేటి ఉదయం 11 గంటలకు ట్యూన్ చేయండి అంటూ పేర్కొన్నారు.
Details
ప్రతి నెలా చివరి ఆదివారం 'మాన్ కీ బాత్' కార్యక్రమం
ప్రధాని 2014 అక్టోబర్ 3న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు, అప్పటి నుండి ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు ఆల్ ఇండియా రేడియోలో ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నారు.
'మన్ కీ బాత్' ప్రజలకు చేరువగా ఉండేందుకు, వారికి కీలకమైన విషయాలపై ప్రధానమంత్రి మాట్లాడటానికి ఒక వేదికగా మారింది.
దేశంలోని మారుమూల ప్రాంతాల్లో జరుగుతున్న విషయాలు, భారతీయులు సాధించిన విజయాలు వంటి అనేక అంశాలను ప్రధాని ప్రజలతో పంచుకుంటున్నారు.
ఈ ప్రత్యేకమైన రోజున మోదీ ఏమి మాట్లాడుతారనే ఆసక్తి నెలకొంది, ఎందుకంటే ఈ కార్యక్రమం ప్రజలతో మమేకం కావాలనే లక్ష్యంతో ప్రారంభమైంది.