PM Modi: నేడు విశాఖకు ప్రధాని మోదీ.. రూ. 2.08 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
మోదీ ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు విశాఖకు చేరుకోనున్నారు. సిరిపురం జంక్షన్ నుంచి ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్ వరకూ రోడ్ షో నిర్వహిస్తారు.
ఈ రోడ్ షోలో ప్రధాని వెంట ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. బహిరంగసభ కోసం ఏర్పాటుచేసిన వేదికను ఇప్పటికే మంత్రులు పర్యవేక్షించారు.
సభా ప్రాంగణాన్ని SPG తమ ఆధీనంలోకి తీసుకుని భద్రతను కట్టుదిట్టం చేశారు. సభా ప్రాంగణానికి 5 వేల మంది పోలీసులు పహారాగా ఉన్నారు.
Details
26 ప్రదేశాల్లో పార్కింగ్ ఏర్పాటు
మొత్తం 35 మంది ఐపీఎస్ అధికారులు ఈ పర్యటనను పర్యవేక్షిస్తున్నారు. మోదీ పర్యటనలో భాగంగా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతాయి.
విశాఖ రైల్వే జోన్ ప్రధానంగా ఇవి అందులో ఉన్నట్లు సమాచారం. బహిరంగసభలో ప్రధాని దాదాపు గంట సేపు పాల్గొంటారు.
సభ ప్రాంగణంలో జిల్లాలు, నియోజకవర్గాల వారీగా బ్లాకులు ఏర్పాటు చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖుల కోసం వీవీఐపీ పాసులు జారీ చేశారు.
సభకు వచ్చే ప్రజల సౌకర్యార్థం 26 ప్రదేశాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. రోడ్ షో మార్గంలో బారికేడ్లను ఏర్పాటు చేయడంతో పాటు సభ కోసం పెద్దఎత్తున జనాలను తరలించేందుకు వేలాది బస్సులు సిద్ధం చేశారు.
Details
కిలోమీటర్ మేర ర్యాలీ
ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 3 లక్షల మంది సభకు హాజరుకావాలని కూటమి నేతలు ప్రణాళికలు రూపొందించారు. విశాఖపట్నం నగరం ప్రధాని పర్యటనకు ప్రత్యేకంగా అలంకరించారు.
2 లక్షల 8 వేల కోట్ల రూపాయల విలువైన పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ INS డేగా వద్ద ప్రధానికి స్వాగతం పలుకుతారు.
అక్కడి నుంచి రోడ్ షో నిర్వహించారు. సిరిపురం జంక్షన్ నుంచి ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్ వరకు సుమారు కిలోమీటర్ మేర ర్యాలీ సాగుతుంది.
అనంతరం పెద్దఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తారు.