Prashanti Kutiram: 'ప్రశాంతి కుటీరం' 50 ఏళ్ల ప్రస్థానం స్ఫూర్తిదాయకం: ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న స్వామి వివేకానంద యోగా అనుసంధాన సంస్థాన్ (ఎస్-వ్యాసా) ప్రధాన కేంద్రం 'ప్రశాంతి కుటీరం' స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్-వ్యాసా విశ్వవిద్యాలయంలో నిర్మించనున్న 'గోల్డెన్ జూబ్లీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్'కు ప్రధాని శంకుస్థాపన చేశారు. అలాగే కేరళ రాజధాని తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయ ఆఫ్ క్యాంపస్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. ఇదే వేదికపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) మాజీ సర్ కార్యవాహ, ప్రముఖ రచయిత హెచ్.వి. శేషాద్రి శతజయంతి వేడుకలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ.. శేషాద్రి రచించిన ఆరు పుస్తకాల హిందీ, ఆంగ్ల అనువాదాలను ఆవిష్కరించారు.
వివరాలు
హెచ్.వి. శేషాద్రి సేవలను కొనియాడిన ప్రధాని
ఈ సందర్భంగా హెచ్.వి. శేషాద్రి సేవలను ప్రధాని కొనియాడారు.
వ్యక్తిత్వ వికాసం ద్వారా దేశ నిర్మాణం సాధించాలనే లక్ష్యంతో ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు.
ఒక దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగి విజయ శిఖరాలను అధిరోహించాలంటే అంకితభావం, సామర్థ్యం, క్రమశిక్షణ కలిగిన పౌరులు అవసరమని శేషాద్రి గుర్తించారని తెలిపారు.
అలాంటి పౌరులను తీర్చిదిద్దేందుకు ఆయన తన చివరి శ్వాస వరకు కృషి చేశారని ప్రశంసించారు.
వివరాలు
'ప్రశాంతి కుటీరం' సేవలపై ప్రశంసలు
కర్ణాటక గొప్ప సాంస్కృతిక, వారసత్వ సంపద మధ్య 'ప్రశాంతి కుటీరం' ఐదు దశాబ్దాలుగా కొనసాగిస్తున్న ప్రస్థానం సేవాభావానికి, అంకితభావానికి ప్రతీకగా నిలిచిందని ప్రధాని మోడీ అన్నారు.
ఈ సంస్థ 50 ఏళ్ల ప్రయాణం ప్రతి భారతీయుడూ తెలుసుకోవాల్సిన స్ఫూర్తిదాయకమైన గాథ అని అభివర్ణించారు.
ఒక చిన్న యోగా కేంద్రంగా ప్రారంభమైన 'ప్రశాంతి కుటీరం' నేడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన గొప్ప ఉద్యమంగా ఎదగడం అభినందనీయమని ప్రధాని పేర్కొన్నారు.
యోగా ద్వారా సమాజానికి సేవ చేస్తూ ఐదు దశాబ్దాలుగా సాగుతున్న ఈ సంస్థ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తినిస్తోందని ప్రశంసించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
'ప్రశాంతి కుటీరం' సేవలు ప్రతి భారతీయుడికి ఆదర్శం: ప్రధాని
#WATCH | Bengaluru, Karnataka | Prime Minister Narendra Modi says, "Amidst the great heritage of Karnataka, the 50-year journey of 'Prashanti Kutiram' stands as an extraordinary saga of service and dedication, a story that every Indian ought to know. The evolution of a modest… https://t.co/luU1OVIe2W pic.twitter.com/UWZlIN4dMx
— ANI (@ANI) November 13, 2026