NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ప్రధాని మోదీ అమెరికా పర్యటన: షెడ్యూల్ ఇదే 
    తదుపరి వార్తా కథనం
    ప్రధాని మోదీ అమెరికా పర్యటన: షెడ్యూల్ ఇదే 
    ప్రధాని మోదీ అమెరికా పర్యటన: షెడ్యూల్ ఇదే

    ప్రధాని మోదీ అమెరికా పర్యటన: షెడ్యూల్ ఇదే 

    వ్రాసిన వారు Stalin
    Jun 19, 2023
    11:28 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నుంచి శనివారం(21-24) వరకు అమెరికాలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు వేలాది మంది ప్రవాసులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన షెడ్యూల్ గురించి ఒకసారి తెలుసుకుందాం.

    ప్రధాని మోదీ అమెరికా టూర్ 2023లో భారత అత్యంత ముఖ్యమైన దౌత్య పర్యటనలలో ఒకటిగా నిలిచిపోనుంది.

    అమెరికా- చైనాల మధ్య వివాదాల నేపథ్యంలో భారతదేశం ఒక ప్రధాన ఆర్థిక, భౌగోళిక రాజకీయ శక్తిగా ఎదుగుతున్న సమయంలో ప్రధాని చేస్తున్న ఈ పర్యటన అంతర్జాతీయంగా ప్రాధాత్యనను సంతరించుకున్నది.

    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రత్యేక ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ యూఎస్ పర్యటనకు వెళ్తున్నారు.

    అమెరికా

    21న యోగా డే, 22న బైడెన్‌తో భేటీ

    ఈ నెల 21వ తేదీన న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి (యూన్) ప్రధాన కార్యాలయంలో 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలతో ప్రధాని మోదీ షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. ఉదయం 7:15 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) యోగా సెషన్ ఉంటుంది.

    ప్రధాని మోదీకి ఈ నెల 22వ తేదీన వాషింగ్టన్ డీసీలోని వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, అతని సతీమణి లాంఛనంగా స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత బైడెన్‌తో ఉన్నత స్థాయి చర్చల్లో మోదీ పాల్గొంటారు.

    ద్వైపాక్షిక చర్చల అనంతరం అదేరోజు మధ్యాహ్నం అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు.

    అదేరోజు సాయంత్రం బైడెన్ దంపతులతో ప్రధాని మోదీ అమెరికా ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసే డిన్నర్‌‌లో పాల్గొంటారు.

    మోదీ

    24న ఈజిప్టుకు వెళ్లనున్న మోదీ

    ఈ నెల 23వ తేదీన అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బిల్కెన్ సంయుక్తంగా నిర్వహించే లంచ్‌లో మోదీ పాల్గొననున్నారు.

    అమెరికా ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలతో పాటు ప్రముఖ కంపెనీల సీఈఓలు, నిపుణులను మోదీ కలవనున్నారు. వారితో చర్చిచనున్నారు.

    ఈ నెల 24వ తేదీన ప్రధాని మోదీ ఈజిప్టు పర్యటనకు వెళ్లనున్నారు. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి జనవరిలో భారత్‌లో పర్యటించారు.

    25వ తేదీన ప్రధాని మోదీ తిరిగి భారత్‌కు పయనం అయ్యే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    అమెరికా
    ప్రధాన మంత్రి
    జో బైడెన్

    తాజా

    Corona Virus: కరోనా డేంజర్‌ బెల్స్‌..4866కి పెరిగిన యాక్టివ్ కోవిడ్-19 కేసులు.. 5 నెలల చిన్నారి సహా ఏడుగురు మృతి కరోనా కొత్త కేసులు
    Raviteja : పూజ కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన రవితేజ,కిషోర్ తిరుమల మూవీ  రవితేజ
    Sachin Tendulkar: ఆర్‌సీబీ విజయోత్సవ వేడుకల్లో తీవ్ర విషాదం.. సంతాపం వ్యక్తం చేసిన స‌చిన్‌ సచిన్ టెండూల్కర్
    Bengaluru Stampede: RCB విజయోత్సవ కార్యక్రమంలో బెంగళూరులో తొక్కిసలాటకు దారితీసిన కారణాలివేనా? బెంగళూరు

    నరేంద్ర మోదీ

    నరేంద్ర మోదీని 'ది బాస్' అని పిలిచిన ఆస్ట్రేలియా ప్రధాని ఆస్ట్రేలియా
    మే 28న కొత్త పార్లమెంట్ భవనం ఎదుట రెజ్లర్ల మహిళా మహాపంచాయతీ దిల్లీ
    ఆస్ట్రేలియాలో ఆలయాలపై దాడుల అంశాన్ని లేవనెత్తిన ప్రధాని మోదీ; కఠినమైన చర్యలకు అల్బనీస్ హామీ  ప్రధాన మంత్రి
    కొత్త పార్లమెంట్ భవనంలో చారిత్రక 'రాజదండం' ఏర్పాటు; స్వాతంత్య్రానికి దానికి ఉన్నసంబంధాన్ని తెలుసుకోండి  అమిత్ షా

    అమెరికా

     అమెరికా: ట్రంప్-రష్యా వ్యవహారంలో ఎఫ్‌బీఐ ఆరోపణలను తప్పబట్టిన ప్రాసిక్యూటర్  డొనాల్డ్ ట్రంప్
    మోదీ కంటే ముందు రాహుల్ అమెరికా పర్యటన; 10రోజులు అక్కడే  రాహుల్ గాంధీ
    భారత్‌లో మత స్వేచ్ఛపై అమెరికా విమర్శలను తిరస్కరించిన కేంద్రం  భారతదేశం
    హైదరాబాద్‌లో డిస్కవరీ గ్రూప్ పెట్టుబడులు; డెవలప్‌మెంట్ సెంటర్‌ ఏర్పాటు హైదరాబాద్

    ప్రధాన మంత్రి

    జపాన్‌: హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ  జపాన్
    ప్రధాని మోదీకి ఫిజీ, పపువా న్యూ గినియా దేశాల అత్యున్నత పురస్కారాలు ప్రదానం  నరేంద్ర మోదీ
    ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభంపై రాజకీయ రగడ బీజేపీ
    సిడ్నీలో ప్రధాని మోదీ అరుదైన స్వాగతం; 'వెల్‌కమ్ మోదీ' అంటూ ఆకాశంలో సందేశం నరేంద్ర మోదీ

    జో బైడెన్

    'ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతల్లో ప్రధాని మోదీ నంబర్ 1' నరేంద్ర మోదీ
    'గూఢచారి' బెలూన్ శిథిలాలను చైనాకు అప్పగించేది లేదు: అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    అధ్యక్ష ఎన్నికల వేళ వైట్‌హౌస్ కీలక ప్రకటన- బైడెన్‌కు పూర్తిస్థాయి వైద్య పరీక్షలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    ఉక్రెయిన్‌కు రైలులో వచ్చిన బైడెన్: సినిమాను తలపించిన అమెరికా అధ్యక్షుడి రహస్య పర్యటన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025