Page Loader
Priyanka Gandi: విజయం దిశగా ప్రియాంక గాంధీ.. వయనాడ్‌లో 2 లక్షలకు పైగా ఆధిక్యం
విజయం దిశగా ప్రియాంక గాంధీ.. వయనాడ్‌లో 2 లక్షలకు పైగా ఆధిక్యం

Priyanka Gandi: విజయం దిశగా ప్రియాంక గాంధీ.. వయనాడ్‌లో 2 లక్షలకు పైగా ఆధిక్యం

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 23, 2024
11:37 am

ఈ వార్తాకథనం ఏంటి

కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ తొలిసారి ఎన్నికల బరిలో నిలిచింది. ఈ పోటీలో ఆమె భారీ ఆధిక్యాన్ని సాధిస్తోంది. ప్రస్తుతం ఆమె రెండు లక్షల ఓట్లకుపైగా ముందంజలో ఉంది. ప్రధానంగా బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్, సీపీఐ అభ్యర్థి సత్యన్ మొకేరి ఈ ఎన్నికల్లో పోటీచేస్తుండగా, ప్రియాంక గాంధీ ప్రభంజనం కొనసాగుతోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 4.3 లక్షల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. ఆ తర్వాత 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ మరోసారి గెలిచినా, రాయ్‌బరేలీలోనూ విజయం సాధించడంతో వయనాడ్ స్థానాన్ని వదులుకున్నారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

Details

వెనుబడిన బీజేపీ, సీపీఐ

ఈ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీకి భారీ మద్దతు లభిస్తోంది. రాహుల్ గాంధీ ప్రభావంతో పాటు, ఆమె గెలుపు దిశగా పయనిస్తోంది. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్, సీపీఐ అభ్యర్థి సత్యన్ మొకేరి ప్రియాంకతో పోటీలో నిలిచినప్పటికీ, కాంగ్రెస్ ఆధ్యిపత్యం ముందు నిలవలేకపోయారు. ప్రియాంక భారీ ఆధిక్యంతో ముందంజలో కొనసాగుతుండగా, బీజేపీ, సీపీఐ అభ్యర్థులు వెనుకబడి ఉన్నారు. రాహుల్ గాంధీ తర్వాత ఇప్పుడు ప్రియాంక గాంధీ గెలుపు దిశగా పయనిస్తుండటంతో కాంగ్రెస్ అధినేత కుటుంబానికి మరో ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది.