Chandra Babu: తిరుమల పవిత్రతను కాపాడండి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
తిరుమలలోని పవిత్రతను కాపాడుతూ, భక్తుల నమ్మకానికి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో ఆయన మాట్లాడారు. తిరుమల కొండపై గోవింద నామస్మరణ తప్ప ఇంకేమీ వినిపించకూడదన్నారు.
ప్రశాంతతకు భంగం కలగకుండా చూసి, నీటి అవసరాల విషయంలో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు.
అటవీ విస్తీర్ణాన్ని 72-80 శాతానికి పైగా పెంచి, అటవీ సంరక్షణకు కట్టుదిట్టమైన ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రసాదాల నాణ్యత మెరుగుపర్చడంలో రాజీపడకూడదన్నారు.
Details
తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించాలి
తిరుమలలోని వీఐపీ సంస్కృతి తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చంద్రబాబు అన్నారు. వీఐపీలు వచ్చినప్పుడు సాధారణ భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.
తితిదే సిబ్బంది భక్తుల పట్ల గౌరవంగా వ్యవహరించి, దేశవిదేశాల నుంచి వచ్చే భక్తులకు మరింత శ్రద్ధగా సేవలందించాలని ఆదేశించారు.
తితిదే సేవలపై భక్తుల అభిప్రాయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యమని చంద్రబాబు పేర్కొన్నారు.
తిరుమలలో చంద్రబాబు తన పర్యటనలో భాగంగా రెండో రోజున అత్యాధునిక వకుళామాత సెంట్రలైజ్డ్ కిచెన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం కూడా పాల్గొన్నారు.