Rahul Gandhi: రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటం: రాహుల్ గాంధీ
భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడం దేశంలో ప్రధాన పోరాటంగా నిలిచిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని కోపంతో లేదా ద్వేషంతో రాయలేదని, వినయం, ఆప్యాయతతో మాత్రమే దీనిని రూపొందించారని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో తన సోదరి ప్రియాంక గాంధీకు మద్దతుగా పాల్గొనడం ద్వారా, వయనాడ్‌లోని మనంతవడిలో జరిగిన కార్నర్ మీటింగ్‌లో ప్రసంగించిన రాహుల్, తన తండ్రి హత్య కేసులో దోషిగా తేలిన వ్యక్తిని ప్రియాంక కౌగిలించుకున్నారని కొనియాడారు. వయనాడ్‌లో జరుగుతున్న ఎన్నికల పోరు ప్రేమ, ద్వేషాల మధ్య జరుగుతోందని తెలిపారు.
నళినిని కలిసిన తర్వాత ప్రియాంక చాలా భావోద్వేగానికి గురైంది:రాహుల్
రాహుల్ గాంధీ మాట్లాడుతూ, "మా నాన్న రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషిగా తేలిన వ్యక్తిని కౌగిలించుకున్నది ప్రియాంకా గాంధీ. నళినిని కలిసిన తర్వాత ప్రియాంక చాలా భావోద్వేగానికి గురైంది. ఆమెను చూసి బాధేసినట్లు చెప్పింది" అని గుర్తు చేసుకున్నారు. ప్రియాంకను సోదరిగా పొందడం తన అదృష్టమని, వయనాడ్‌లో విజయం సాధిస్తే అత్యుత్తమ ఎంపీగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.
ప్రేమ, ఆప్యాయతతో కూడిన రాజకీయాలు అవసరం: రాహుల్
దేశంలో ప్రస్తుతం రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటం జరుగుతున్నందున, ద్వేషంతో లేదా కోపంతో రాజ్యాంగాన్ని రాయలేదని, బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడి, సంవత్సరాల తరబడి జైలులో గడిపిన వారు వినయంతో, ప్రేమతో రాజ్యాంగాన్ని రూపొందించారని రాహుల్ గాంధీ చెప్పారు. అందుకే, ద్వేషపూరిత రాజకీయాలు అవసరం లేదు, అందుకు బదులుగా ప్రేమ, ఆప్యాయతతో కూడిన రాజకీయాలు అవసరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.