Loading...
Chandrababu Naidu: ఏపీకి తక్షణ ఆర్థిక సాయం అందించండి.. నిర్మలా సీతారామన్‌కు చంద్రబాబు విజ్ఞప్తి
ఏపీకి తక్షణ ఆర్థిక సాయం అందించండి.. నిర్మలా సీతారామన్‌కు చంద్రబాబు విజ్ఞప్తి

Chandrababu Naidu: ఏపీకి తక్షణ ఆర్థిక సాయం అందించండి.. నిర్మలా సీతారామన్‌కు చంద్రబాబు విజ్ఞప్తి

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 17, 2026
03:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు కీలక అంశాలపై ఆమెతో చర్చించారు. ముఖ్యంగా రాయలసీమ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టు ప్రతిపాదనలను అమలు చేసే అంశంపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. అలాగే, వరుస తుపానులతో నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

వివరాలు

తుపానులు, ఎల్‌నినో ప్రభావంతో నష్టం

ఇటీవల రాష్ట్రంలో అర్నబ్, మురసు తుపానులతో పాటు ఎల్‌నినో ప్రభావం కారణంగా జరిగిన నష్టాన్ని చంద్రబాబు కేంద్ర మంత్రికి వివరించారు.

తుపానుల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసిన వివరాలతో కూడిన నివేదికలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు గుర్తు చేశారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రానికి తక్షణ ఆర్థిక సహాయం అందించాలని నిర్మలా సీతారామన్‌ను అభ్యర్థించారు.

రాత్రికి అమరావతికి తిరుగు ప్రయాణం

కేంద్ర ఆర్థిక మంత్రితో అధికారిక సమావేశం ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు ఢిల్లీలో మరో కార్యక్రమానికి హాజరుకానున్నారు.

ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా నివాసంలో జరిగే శుభకార్యానికి ఆయన వెళ్లనున్నారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత రాత్రికి అమరావతికి తిరుగు ప్రయాణం కానున్నారు.

ADVERTISEMENT