Pooja Khedkar: పూజా ఖేద్కర్ వికలాంగ ధ్రువీకరణ పత్రం నకిలీది.. హైకోర్టుకు తెలిపిన ఢిల్లీ పోలీసులు
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ మాజీ అధికారి పూజా ఖేద్కర్‌కు కష్టాలు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఢిల్లీ పోలీసులు ఈ వ్యవహారంపై ఢిల్లీ హైకోర్టులో స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేశారు. 2022, 2023లో జరిగిన సివిల్ సర్వీసెస్ పరీక్షలో పూజ సమర్పించిన వైకల్య ధ్రువీకరణ పత్రం నకిలీదని తేలింది. ఈ సర్టిఫికెట్‌లో పూజ తన పేరును కూడా మార్చుకుంది.
సర్టిఫికెట్ మేము జారీ చెయ్యలేదు: మెడికల్ అథారిటీ
మీడియా నివేదికల ప్రకారం, పూజా 2022- 2024లో 2 వైకల్య ధృవీకరణ పత్రాలను సమర్పించారని, వీటిని అహ్మద్‌నగర్ మహారాష్ట్ర మెడికల్ అథారిటీ జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు మెడికల్ అథారిటీ ఇచ్చిన సర్టిఫికెట్లను వెరిఫై చేయగా.. ఈ సర్టిఫికెట్లు తాము జారీ చేసినవి కావని చెప్పారు. అంటే ఆ సర్టిఫికేట్ ఫేక్ అయ్యే అవకాశం ఉంది.