Page Loader
గద్దర్‌ మరణంపై ఆర్‌.నారాయణ మూర్తి దిగ్భ్రాంతి.. ఒక శకం ముగిసిందని ఆవేదన
గద్దర్‌ మరణంపై ఆర్‌.నారాయణ మూర్తి దిగ్భ్రాంతి

గద్దర్‌ మరణంపై ఆర్‌.నారాయణ మూర్తి దిగ్భ్రాంతి.. ఒక శకం ముగిసిందని ఆవేదన

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 06, 2023
06:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ప్రజల ఉద్యమ గొంతుక, ప్రజాగాయకుడు గద్దర్ మరణంపై ఆర్‌.నారాయణమూర్తి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజా వాగ్గేయకారుల్లో మరో శకం ముగిసిందని ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గద్దర్ మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం తెలియజేశారు. పాటలతో ప్రజా చైతన్యానికి ఎనలేని కృషి చేసిన ప్రజా యుద్ధనౌక గద్దర్ అని కీర్తించారు. బడుగు, బలహీన వర్గాల విప్లప స్పూర్తి గద్దర్ అని ఏపీ సీఎం జగన్ అన్నారు. ప్రజల గుండెల్లో గద్దర్ చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఈ మేరకు గద్దర్ కుటుంబీకులకు బాసటగా నిలుద్దామన్నారు. ఆస్పత్రిలో గద్దర్‌ పార్థివదేహాన్ని రేవంత్​ రెడ్డి, వీహెచ్, సీతక్క, గోరటివెంకన్న, విమలక్కలు సందర్శించారు. ఆయన భౌతికకాయాన్ని చూసి విమలక్క తీవ్రంగా విలపించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ట్విట్టర్ వేదికగా చంద్రబాబు సంతాపం