LOADING...
Rahul Gandhi: ఎంఎస్‌పీకి చట్టబద్ధత కల్పిస్తాం: రైతులకు మద్దతు తెలిపిన రాహుల్ గాంధీ
Rahul Gandhi: ఎంఎస్‌పీకి చట్టబద్ధత కల్పిస్తాం: రైతులకు మద్దతు తెలిపిన రాహుల్ గాంధీ

Rahul Gandhi: ఎంఎస్‌పీకి చట్టబద్ధత కల్పిస్తాం: రైతులకు మద్దతు తెలిపిన రాహుల్ గాంధీ

వ్రాసిన వారు Stalin
Feb 13, 2024
05:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

పంటలకు కనీస మద్దతు ధర( MSP) ప్రకటించాలని, ఇతర డిమాండ్లను నెరవేర్చాలని మంగళవారం రైతులు చేస్తున్న ఆందోళనలతో దిల్లీ సరిహద్దులు రణరంగంగా మారాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కీలక ప్రకటన చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే స్వామినాథన్ కమీషన్ ప్రకారం ఎంఎస్‌పీ (కనీస మద్దతు ధర) ఇస్తామని చెప్పారు. రాహుల్ గాంధీ చేస్తున్న 'కాంగ్రెస్‌ భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర' ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌‌లో కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆయన రైతు సమస్యలపై స్పందించారు. దేశంలో రైతులకు అందాల్సినవి అందడం లేదన్నారు. అందుకే రైతులు దిల్లీకి వెళ్తుంటే అడ్డుకుంటున్నారన్నారు.

రాహుల్

ఈరోజు చారిత్రాత్మకమైనది: రాహుల్ గాంధీ

రైతుల ఆందోళనలపై రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా కీలక కామెంట్స్ చేశారు. 'రైతు సోదరులారా, ఈ రోజు చారిత్రాత్మకమైన రోజు! స్వామినాథన్ కమీషన్ ప్రకారం పంటలకు ప్రతి రైతుకు చట్టపరమైన హామీ ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ చర్య 15 కోట్ల రైతు కుటుంబాలను వారి శ్రేయస్సుకు భరోసా ఇవ్వడం ద్వారా వారి జీవితాలను మారుస్తుంది. న్యాయ్ యాత్రలో కాంగ్రెస్ తొలి హామీ ఇదే' అని రాహుల్ ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ ఇంకా మాట్లాడుతూ.. మణిపూర్‌ను బీజేపీ తగలబెట్టిందన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతోందన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాహుల్ గాంధీ ట్వీట్