Page Loader
Rahul Gandhi :'మోదీ వేసిన సూట్ మళ్లీ వేయడు..నాకు తెల్లని టీషర్టు చాలు' 
Rahul Gandhi :'మోదీ వేసిన సూట్ మళ్లీ వేయడు..నాకు తెల్లని టీషర్టు చాలు'

Rahul Gandhi :'మోదీ వేసిన సూట్ మళ్లీ వేయడు..నాకు తెల్లని టీషర్టు చాలు' 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 10, 2023
05:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రదేశ్‌లోని సాత్నాలో జరిగిన కాంగ్రెస్ ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రదాని మోదీపై విమర్శలు సంధించారు. మోదీ ఖరీదైన సూట్‌లనే ధరిస్తారన్నారు. ఓబీసీల గురించి మాట్లాడే మోదీ రూ.2 కోట్ల సూట్ వేస్తారన్నారు. తనకు మాత్రం తెల్లని టీషర్ట్ ఉంటే చాలన్నారు. ఈ మధ్య కులాల సమస్యలపై ప్రధాని దృష్టిసారిస్తున్నారని రాహుల్ చురకలు అంటించారు. జీఎస్‌టీ ద్వారా పేదలను పణంగా పెట్టి బడా వ్యాపారులకు కేంద్రం అండగా నిలుస్తోందని ఆరోపించారు. ఇటీవలే మోదీ స్పీచ్‌ల్లో తాను ఓబీసీకి చెందినవాడినని ప్రతి చోటా చెబుతున్నారని, ఆ మాటలు చెప్పే ప్రధాని అయ్యారన్నారు. మోదీ సూట్ లక్షల్లో ఉంటుందని, రోజుకు కనీసం రెండు సూట్లు మారుస్తుంటారన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే జనాభా గణనను నిర్వహిస్తామన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మోదీ వేషధారణపై రాహుల్ ఫైర్

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మోదీ సూట్ రూ. 2 కోట్లు : రాహుల్ గాంధీ