Page Loader
Rahul Gandhi : మహమ్మద్ షమీకి రాహుల్ బాసట..కంగ్రాట్యూలేషన్స్ చెప్పిన కాంగ్రెస్ అగ్రనేత

Rahul Gandhi : మహమ్మద్ షమీకి రాహుల్ బాసట..కంగ్రాట్యూలేషన్స్ చెప్పిన కాంగ్రెస్ అగ్రనేత

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 16, 2023
11:00 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచకప్ సెమీఫైనల్‌లో భారత్ ఘన విజయంలో కీలక పాత్ర పోషించిన టీమిండియా పేసర్ మహమ్మద్ షమీని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభినందించారు. షమీ అద్భతమైన బౌలింగ్ టీమిండియాకు అపూర్వమైన విజయం అందించిందని కొనియాడారు. గతంలోనూ మహ్మద్ షమీకి రాహుల్ గాంధీ అండగా నిలిచారు. 2021లో పాకిస్థాన్‌తో భారత్ ఓటమి సందర్భంగా షమీ ట్రోల్ కు గురయ్యారు. ఆ సమయంలో అతనికి కేవలం రాహుల్ మాత్రమే మద్ధతిచ్చి అండగా నిలిచారని యూత్ కాంగ్రెస్ చీఫ్ శ్రీనివాస్ బీవీ గుర్తుచేశారు. మహ్మద్ షమీ, మీ వెంట తామంతా ఉన్నామని, ఈ వ్యక్తులు ద్వేషంతో నిండి ఉన్నారు, ఎందుకంటే వారికి ఎవరూ ప్రేమను ఇవ్వరు. వారిని క్షమించు అని 2021లో రాహుల్ ట్వీట్ చేయడం గమనార్హం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మహమ్మద్ షమీ బౌలింగ్ ను ప్రశంసించిన రాహుల్ గాంధీ

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కష్టకాలంలో షమీకి అండగా నిలిచిన రాహుల్