NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rahul Gandhi :తెలుగు భాషను 'ప్రైడ్ ఆఫ్ ఇండియా' గా అభివర్ణించిన రాహుల్ గాంధీ 
    తదుపరి వార్తా కథనం
    Rahul Gandhi :తెలుగు భాషను 'ప్రైడ్ ఆఫ్ ఇండియా' గా అభివర్ణించిన రాహుల్ గాంధీ 

    Rahul Gandhi :తెలుగు భాషను 'ప్రైడ్ ఆఫ్ ఇండియా' గా అభివర్ణించిన రాహుల్ గాంధీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 09, 2024
    12:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ, అమెరికా పర్యటనలో భాగంగా డాలస్‌లోని ప్రవాస భారతీయులతో ముచ్చటించారు.

    భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన అన్నారు. భాషలు, సంప్రదాయాల ఆధారంగా ప్రజలను విడదీయకూడదని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

    ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా తెలుగు భాష గురించి ప్రస్తావించారు.

    "మన జాతీయ గీతం అన్ని రాష్ట్రాలను సమానంగా ప్రతిబింబిస్తుంది. కానీ అందులో ఏ రాష్ట్రం బెస్ట్‌ అని,మరొక రాష్ట్రం సెకండ్‌ బెస్ట్‌ అని అందులో ఎక్కడా ఉండదు.

    భారతదేశం రాష్ట్రాల సమాఖ్యగా ఉంటుందని అది స్పష్టంగా చెబుతుంది. భాషలు,సంప్రదాయాలు కూడా అలాంటివే.

    తమిళం మాట్లాడేవారు మాకు ఇష్టంలేదు అని, హిందీ మాట్లాడేవారే మనకు ఇష్టమని చెప్పడం సరికాదు," అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

    వివరాలు 

    ఆ రాష్ట్ర ప్రజలను అవమానించినట్లే..

    అదే విధంగా, "తెలుగు గురించి ఆలోచించండి. తెలుగు అనేది కేవలం ఒక భాష మాత్రమే కాదు, అది ఒక చరిత్ర, సంప్రదాయం,సంస్కృతిని సూచిస్తుంది.

    మీరు తెలుగు భాషను హిందీతో పోలిస్తే అంత ముఖ్యమేమీ కాదని చెప్పినట్లయితే, ఆ రాష్ట్ర ప్రజలను అవమానించినట్లే. మీరు తెలుగు చరిత్ర, సంప్రదాయం, సంస్కృతి, పూర్వీకులను తక్కువగా చూడాలని చెప్పినట్లే అవుతుంది," అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

    ఇది అర్థం చేసుకోకపోవడం వల్లే భారత్‌లో భిన్నతకు సంబంధించిన వివాదాలు కొనసాగుతున్నాయంటూ ఆయన బీజేపీ పై విమర్శలు గుప్పించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాహుల్ గాంధీ

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    రాహుల్ గాంధీ

    Rahul Gandhi: భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొన్న అఖిలేష్ యాదవ్ భారత్ జోడో న్యాయ్ యాత్ర
    ముగిసిన రాహుల్ గాంధీ యాత్ర.. నేడు ముంబైలో 'ఇండియా' కూటమి మెగా ర్యాలీ  ఇండియా కూటమి
    Lok Sabha 2024: రాహుల్‌ గాంధీతో వయనాడ్ లో తలపడే బీజేపీ అభ్యర్థి ఎవరంటే? 2024 సార్వత్రిక ఎన్నికలు
    Rahul Gandhi: కాంగ్రెస్ 50% ప్రభుత్వ ఉద్యోగాలను మహిళలకు రిజర్వ్ చేస్తుంది  : రాహుల్ గాంధీ కాంగ్రెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025