Page Loader
కాంగ్రెస్‌ను వీడటానికి రాహుల్ గాంధీనే కారణం: గులాం నబీ ఆజాద్
కాంగ్రెస్‌ను వీడటానికి రాహుల్ గాంధీనే కారణం: గులాం నబీ ఆజాద్

కాంగ్రెస్‌ను వీడటానికి రాహుల్ గాంధీనే కారణం: గులాం నబీ ఆజాద్

వ్రాసిన వారు Stalin
Apr 06, 2023
10:39 am

ఈ వార్తాకథనం ఏంటి

డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ అధినేత గులాం నబీ ఆజాద్ మరోసారి కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. తాను కాంగ్రెస్ వీడటానికి ప్రధాన కారణం రాహుల్ గాంధీ అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు చెందిన ఆనంద్ శర్మ, ఎన్‌సీపీ నేత సుప్రియా సూలే, డీఎంకేకు చెందిన కనిమొళి, ఆప్‌కి చెందిన సంజయ్ సింగ్‌తో సహా పలువురు రాజకీయ నాయకుల సమక్షంలో గులాం నబీ ఆజాద్ తన ఆత్మకథను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. యువ నాయకులతో పాటు అనేక మంది సీనియర్లు కాంగ్రెస్‌ నుంచి వెళ్లిపోవడానికి రాహుల్ గాంధీనే కారణం అని గులాం నబీ అన్నారు. తాను కాంగ్రెస్‌లో ఉంటే వెన్నుముక లేని వ్యక్తిగా ఉండాలన్నారు.

ఆజాద్

ట్విట్టర్‌లో రాజకీయాలు చేసే వారి కంటే నేను 2000శాతం ఎక్కువ కాంగ్రెస్ వాదిని: ఆజాద్

ట్విట్టర్‌లో రాజకీయాలు చేసే వారి కంటే తాను 2000శాతం ఎక్కువ కాంగ్రెస్ వాదినన్నారు. పార్టీకి తన లాంటి వాళ్లు అక్కర్లేదన్నారు. భారత్ జోడో యాత్ర తర్వాత పార్టీకి 500 సీట్లు వస్తాయని చెప్పగల వక్తులు వారికి కావాలన్నారు. ఇందిరా గాంధీ లేదా రాజీవ్ గాంధీ చేసిన దానిలో 1/50 వంతు రాహుల్ గాంధీ పని చేసి ఉంటే అతను తప్పకుండా విజయం సాధించగలడని తాను కోరుకుంటున్నట్లు ఆజాద్ చెప్పారు. తనకు ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు రావడం వల్లే హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు దిల్లీలో తన ప్రభుత్వ బంగ్లాను కేటాయించారని ఆజాద్ చెప్పారు. తాను బీజేపీకి గులాం కాలేదని కాంగ్రస్ నాయకుల విమర్శలపై స్పందించారు.