Page Loader
తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ జూమ్ మీటింగ్.. కీలక సూచనలు 
తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ జూమ్ మీటింగ్.. కీలక సూచనలు

తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ జూమ్ మీటింగ్.. కీలక సూచనలు 

వ్రాసిన వారు Stalin
Dec 02, 2023
07:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

Rahul Gandhi zoom meeting: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఆదివారం ఉదయం 8గంటలకు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ సమయంలో కాంగ్రెస్ నాయకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాహుల్ గాంధీ తెలంగాణ నేతలతో జూమ్ మీటింగ్‌లో మాట్లాడారు. పార్టీ నేతలకు కీలక సూచనలు చేశారు. అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ కౌంటింగ్‌ కేంద్రాలు దాటి బయటకు రావొద్దని సూచించారు. ఏఐసీసీ పరిశీలకులు కౌంటింగ్‌ కేంద్రాల వద్దే ఉండాలని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఏమైనా.. ఇబ్బందులు ఉంటే, రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఇదిలా ఉంటే, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ శనివారం రాత్రి 11గంటలకు హైదరాబాద్ రానున్నారు. తాజ్‌కృష్ణ హోటల్‌ నుంచి ఆయన కౌంటింగ్‌‌ను పరిశీలించనున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాలు దాటి బయటకు రావొద్దు: రాహుల్