
పొంగులేటి, జూపల్లి సహా తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ సమావేశం
ఈ వార్తాకథనం ఏంటి
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహా పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్దమైంది.
తెలంగాణ కాంగ్రెస్ నేతలతో కలిసి పొంగులేటి, జూపల్లి కృష్ణారావుతో సోమవారం దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. వీరి వెంట తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా ఉన్నారు.
పొంగులేటి, జూపల్లి సహా మొత్తం 35మంది బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరనున్నారు.
ఈ మేరకు చేరికల లిస్ట్‌ను కూడా కాంగ్రెస్ విడుదల చేసింది.
జులై మొదటి వారంలో ప్రియాంక గాంధీ సమక్షంలో ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో ఈ భారత రాష్ట్ర సమితి నేతలు అధికారికంగా కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ సమావేశం
दिल्ली स्थित AICC मुख्यालय में कांग्रेस अध्यक्ष श्री @kharge, पूर्व अध्यक्ष श्री @RahulGandhi, संगठन महासचिव श्री @kcvenugopalmp और तेलंगाना प्रदेश अध्यक्ष श्री @revanth_anumula सहित कांग्रेस नेताओं की बैठक जारी। pic.twitter.com/FXyIFgUT9k
— Congress (@INCIndia) June 26, 2023