Bharat Nyay Yatra: జనవరి 14 నుంచి రాహుల్ గాంధీ 'భారత్ న్యాయ్ యాత్ర' ప్రారంభం
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రెండవ ఎడిషన్‌ను జనవరి 14న ప్రారంభించనున్నారు. 'భారత్ న్యాయ్ యాత్ర'గా పేరు మార్చబడిన ఈ మార్చ్ దేశంలోని తూర్పు నుండి పడమర వరకు సాగుతుంది. ఈ యాత్ర ఈశాన్య ప్రాంతంలోని మణిపూర్ నుండి ప్రారంభమై,మహారాష్ట్రలోని ముంబైలో ముగుస్తుంది. రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్రలో భాగంగా 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాలలో ఈ యాత్ర చేపడతారు. మణిపూర్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రల్లో మొత్తంగా 6,200 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది. జనవరి 14న మణిపూర్ నుంచి పాదయాత్రను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే జెండా ఊపి ప్రారంభించనున్నారు.