పాంగాంగ్ సరస్సుకు రాహుల్ గాంధీ బైక్ రైడ్; స్టైలిష్ లుక్‌లో కాంగ్రెస్ నేత
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బైక్ రైడ్ చేస్తూ కొత్తగా కనిపించారు. స్టైలిష్ లుక్‌లో సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారారు. రాహుల్ గాంధీ శనివారం తూర్పు లద్ధాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు వద్దకు బైక్‌పై వెళ్లారు. ఆగస్టు 20వ తేదీన తన తండ్రి, దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని పాంగాంగ్‌లో జరుపుకునేందుకు ఆయన పాంగాంగ్ సరస్సు వద్దకు చేరుకున్నారు. ఇక్కడి పర్యాటక శిబిరంలో రాహుల్ గాంధీ శనివారం రాత్రి బస చేయనున్నారు. రాహుల్ గాంధీ తన లడఖ్ పర్యటన సందర్భంగా శుక్రవారం లేహ్‌లో 500 మందికి పైగా యువకులతో ఇంటరాక్టివ్ సెషన్‌ను నిర్వహించినట్లు కాంగ్రెస్ ప్రతినిధి సెరింగ్ నమ్‌గ్యాల్ వెల్లడించారు.
ఆర్టికల్ 370ని రద్దు తర్వాత రాహుల్ మొదటి పర్యటన
2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత రాహుల్ గాంధీ లద్ధాఖ్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. వాస్తవానికి రాహుల్ గాంధీ లేహ్ పర్యటనను ముందు కవలం రెండు రోజులే అనుకున్నారు. కానీ ఇప్పుడు అయన పర్యటనను ఆగస్టు 25 వరకు పొడిగించారు. సెప్టెంబర్ 10న జరగనున్న కార్గిల్ హిల్ కౌన్సిల్ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి వ్యతిరేకంగా కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ ముందస్తు ఎన్నికల కూటమిని ఏర్పాటు చేశాయి. రాహుల్ తన పర్యటనలో కార్గిల్‌లోని పార్టీ నేతలతో సమావేశమయ్యే అవకాశం ఉందని పార్టీ అధికార ప్రతినిధి తెలిపారు.