Page Loader
RahulGandhi: నేడు హైదరాబాద్‌కు రాహుల్‌ గాంధీ.. కులగణనపై సమీక్ష
నేడు హైదరాబాద్‌కు రాహుల్‌ గాంధీ.. కులగణనపై సమీక్ష

RahulGandhi: నేడు హైదరాబాద్‌కు రాహుల్‌ గాంధీ.. కులగణనపై సమీక్ష

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 05, 2024
08:40 am

ఈ వార్తాకథనం ఏంటి

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ రోజు సాయంత్రం (మంగళవారం) హైదరాబాద్ కు రానున్నారు. రేపటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో చేపట్టనున్న కులగణనపై ప్రజల నుండి, మేధావులు, వివిధ సామాజిక వర్గాల వ్యక్తుల నుండి సలహాలు, సూచనలు స్వీకరించడానికి రాహుల్ హైదరాబాద్ కు వస్తున్నారు. పీసీసీ ఆధ్వర్యంలో బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలాజీ సెంటర్‌లో నిర్వహించే మీటింగ్‌లో రాహుల్ పాల్గొననున్నారు. సాయంత్రం 4:45కి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 5:20కి బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలాజీ సెంటర్‌కు చేరుకుంటారు.

వివరాలు 

మీటింగ్‌కు మీడియాకు అనుమతి లేదు

సాయంత్రం 5:30కి కులగణనపై నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. ఈ మీటింగ్ సుమారు గంట పాటు జరుగుతుంది. అనంతరం రాహుల్ గాంధీ 7:10కి బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుని తిరిగి ఢిల్లీకి పయనమవుతారు. అయితే,ఈ మీటింగ్‌కు మీడియాకు అనుమతి లేదు.అయితే ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించిన లైవ్ సిగ్నల్స్ లింక్‌ను తెలంగాణ కాంగ్రెస్ మీడియాకు అందుబాటులో ఉంచుతామని గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,ఎంపీలు,వివిధ రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లు,డీసీసీ అధ్యక్షులు పాల్గొంటారు. మరికొంత మంది ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రతినిధులతో పాటు రిటైర్డ్ జడ్జీలు, ప్రొఫెసర్లు, కవులు,కళాకారులు, మేధావులు కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది.