LOADING...
Maha Kumbhmela: కుంభమేళాకు నేటి నుంచి అందుబాటులోకి స్పెషల్‌ వందే భారత్‌ రైలు
కుంభమేళాకు నేటి నుంచి అందుబాటులోకి స్పెషల్‌ వందే భారత్‌ రైలు

Maha Kumbhmela: కుంభమేళాకు నేటి నుంచి అందుబాటులోకి స్పెషల్‌ వందే భారత్‌ రైలు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 15, 2025
02:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులకు శుభవార్త. ప్రస్తుతం ట్రాఫిక్‌, ఇతర సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్న భక్తులను దృష్టిలో ఉంచుకొని, వారి ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు నార్తర్న్ రైల్వేస్‌ ప్రత్యేక వందే భారత్‌ రైలును నడపనుంది. ఈ ప్రత్యేక రైలు ఫిబ్రవరి 15, 16, 17 తేదీల్లో ప్రయాణికుల సేవలో ఉండనుంది. ఢిల్లీ నుంచి ప్రయాగ్‌రాజ్‌ మీదుగా వారణాసి వరకు ఈ రైలు ప్రయాణించనుంది.

వివరాలు 

వందే భారత్‌ రైలు ప్రయాణ సమయాలు: 

ప్రత్యేక వందే భారత్‌ రైలు (02252) న్యూ ఢిల్లీ నుండి ఉదయం 5:30 గంటలకు బయల్దేరి, మధ్యాహ్నం 12:00 గంటలకు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి మధ్యాహ్నం 2:20 గంటలకు వారణాసి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 02251 నంబర్‌ వందే భారత్‌ రైలు వారణాసి నుంచి మధ్యాహ్నం 3:15 గంటలకు బయల్దేరి, సాయంత్రం 5:20 గంటలకు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటుంది. రాత్రి 11:50 గంటలకు ఢిల్లీ స్టేషన్‌కు చేరుకుంటుంది. ఈ రైలు ప్రారంభానికి సంబంధించి, నార్తర్న్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ ఒక ప్రకటనలో తెలిపారు. మహా కుంభమేళా కారణంగా వారాంతాల్లో భక్తుల రద్దీ పెరుగుతుందని భావించి ఈ ప్రత్యేక రైలు నడపాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

వివరాలు 

భక్తుల రద్దీ, ట్రాఫిక్ పరిస్థితి

మహా కుంభమేళాకు దేశం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. దీనివల్ల రైల్వే స్టేషన్లు యాత్రికులతో కిక్కిరిసిపోతున్నాయి. రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్న భక్తుల సంఖ్య పెరిగిపోవడంతో ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే ప్రధాన రహదారులపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గత వారాంతంలో 300 కిలోమీటర్ల మేర వాహనాల రద్దీ ఏర్పడినట్లు రిపోర్టులు వెల్లడించాయి.

వివరాలు 

మహా కుంభమేళా విశేషాలు: 

మహా కుంభమేళా గత నెల జనవరి 13న ప్రారంభమై, ఫిబ్రవరి 26న మహాశివరాత్రి సందర్భంగా ముగియనుంది. 45 రోజుల పాటు సాగే ఈ ఆధ్యాత్మిక ఉత్సవానికి లక్షలాదిమంది భక్తులు హాజరవుతున్నారు. గంగ, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం చేసి భక్తులు తమ ఆధ్యాత్మికతను తాకి ఆనందిస్తున్నారు. ఫిబ్రవరి 14 వరకు దాదాపు 50 కోట్ల మంది భక్తులు నదీ స్నానం చేసినట్లు ఉత్తరప్రదేశ్ అధికారులు వెల్లడించారు.