
Rain Alert: తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్షసూచన..ఎల్లో అలర్ట్ జారీ
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులు,ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఇవాళ కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
వివరాలు
గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు
రేపు హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, నల్గొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఇక ఎల్లుండి హనుమకొండ, వరంగల్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రజలకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.