Page Loader
తెలంగాణకు ఎల్లో అలెర్ట్ జారీ.. మరో 2 రోజులు భారీ వర్షాలు
తెలంగాణకు ఎల్లో అలెర్ట్ జారీ.. మరో 2 రోజులు భారీ వర్షాలు

తెలంగాణకు ఎల్లో అలెర్ట్ జారీ.. మరో 2 రోజులు భారీ వర్షాలు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 13, 2023
05:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో మరో రెండు రోజులూ వర్షాలు కొనసాగనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం కురవనున్నట్లు వెల్లడించింది. ఇక జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ వానలు పడే అకాశాలున్నట్లు అంచనా వేసింది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఉత్తర తెలంగాణలోని జిల్లాలు ఆదిలాబాద్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాలో వర్షాలు పడనున్నాయి. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, మెదక్‌, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది.

DETAILS

నిర్మల్‌ జిల్లా లోకేశ్వరంలో అత్యధికంగా 13.6 సెంటీమీటర్ల వర్షాపాతం

ఇక శుక్రవారం నుంచి శనివారం వరకు కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వరంగల్‌, మహబూబాబాద్‌, జనగాం, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం వివరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను సైతం జారీ చేసింది. ఇవాళ ములుగు, కొత్తగూడెం, నిజామాబాద్‌లో పలుచోట్ల మోస్తరు వర్షాపాతం కురిసింది. గత 24 గంటల్లో నిర్మల్‌, నిజామాబాద్‌, సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి, మహబూబాబాద్‌, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వానలు కురిశాయి. అయితే రాష్ట్రంలోనే అత్యధికంగా నిర్మల్‌ జిల్లా లోకేశ్వరంలో 13.6 సెంటీమీటర్ల మేర వర్షాపాతం నమోదైందని తెలంగాణ స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సోసైటీ (టీఎస్‌డీపీఎస్‌) వివరించింది.