
రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేకు షాక్..బీజేపీ ఎన్నికల కమిటీల్లో దక్కని చోటు
ఈ వార్తాకథనం ఏంటి
రాజస్థాన్ ఎన్నికల కోసం బీజేపీ అధిష్టానం రెండు కీలక కమిటీలను ప్రకటించింది. త్వరలోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో మాజీ సీఎం, బీజేపీ నేత వసుంధరా రాజేకు కమిటీల్లో చోటు దక్కలేదు.
జైపూర్ లో సభ్యత్వ నమోదు, కోర్ కమిటీ సమావేశాలకు రాజే గైర్హాజరయ్యారు.మరోవైపు త్వరలో మూడో కమిటీని ప్రకటించనున్నారు.
దీనిపై స్పందించిన రాష్ట్ర ఇన్‌ఛార్జ్ అరుణ్ సింగ్, రాజే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారన్నారు. వసుంధర బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, 2 సార్లు సీఎంగా పనిచేశారు. తామంతా రాజేను గౌరవిస్తాం, ఎన్నికల్లో ప్రచారం చేస్తారన్నారు.
ఎన్నికల సమయంలో కేంద్ర, రాష్ట్ర నేతలు ప్రచారం చేస్తారని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు.రాజేకు చాలా పనులు అప్పగించామని, ఆమె ప్రచారంలో పాల్గొంటారని జోషి స్పష్టంచేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వసుంధర రాజే మా సీనియర్ నేత, ఆమెకు చాలా పనులు అప్పగించాం : జోషి
#WATCH | Jaipur: Union Minister Pralhad Joshi says, "Vasundhara Raje is our senior leader...We have involved her in several programs and will continue to do so in future as well." https://t.co/DxHEENFImg pic.twitter.com/fhHoUbDRsK
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 17, 2023