Loading...
Sonia Gandhi: రాజీవ్ గాంధీ భద్రతను ఉద్దేశపూర్వకంగానే తొలగించారు: సోనియా గాంధీ
రాజీవ్ గాంధీ భద్రతను ఉద్దేశపూర్వకంగానే తొలగించారు: సోనియా గాంధీ

Sonia Gandhi: రాజీవ్ గాంధీ భద్రతను ఉద్దేశపూర్వకంగానే తొలగించారు: సోనియా గాంధీ

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 24, 2026
12:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యేలా చేయాలనే ఉద్దేశంతోనే అప్పట్లో ఆయన భద్రతను కావాలని తొలగించారని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. తన జీవిత అనుభవాల ఆధారంగా రచించిన 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' (Belonging: A Journey of Love) పుస్తకం గురించి తన పిల్లలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో ఆమె ప్రత్యేకంగా సంభాషించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ భద్రత, ఆయన హత్యకు ముందు జరిగిన పరిణామాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సంభాషణకు సంబంధించిన వీడియోను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తమ ఎక్స్ (X) ఖాతాల్లో పంచుకున్నారు.

వివరాలు 

రాజీవ్ భద్రత తొలగింపు ప్రమాదవశాత్తు జరిగింది కాదు

రాజీవ్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చేపట్టిన పర్యటనలను సోనియా గాంధీ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

అప్పట్లో ఆయన ఓపెన్ జీపులో ప్రయాణించేవారని,ఆ సమయంలో రాళ్ల దాడులు, నిరసనలు ఎదుర్కోవాల్సి వచ్చేదని చెప్పారు.

ఆ పర్యటనలు చాలా భయానకంగా ఉండేవని వివరించారు.ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పర్యటించినప్పుడు అక్కడి అధికారులు రాజీవ్ భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోలేదని ఆరోపించారు.

ముఖ్యంగా బీహార్ పర్యటన తనలో తీవ్ర ఆందోళన కలిగించిందని తెలిపారు.

రాజీవ్ గాంధీ భద్రతను ఉద్దేశపూర్వకంగానే తొలగించారని,దాని ఫలితంగానే ఆయన హత్యకు గురయ్యారని సోనియా గాంధీ ఆరోపించారు.

ఆయన భద్రతను తొలగించడం అనుకోకుండా జరిగిన పరిణామం కాదని,ఆయనను హత్య చేయాలనే ఉద్దేశంతోనే కావాలని అలాచేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

వివరాలు 

రాజీవ్ భద్రతపై ముందే ఆందోళన వ్యక్తం చేసిన రాహుల్

రాజీవ్ గాంధీతో కలిసి ఓ పర్యటనలో పాల్గొన్న రాహుల్ గాంధీ కూడా అప్పట్లో రాళ్ల దాడులు, నిరసనలను ప్రత్యక్షంగా చూశారని సోనియా గుర్తుచేసుకున్నారు.

ఆ పర్యటన ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత రాహుల్ తనతో మాట్లాడిన విషయాన్ని వెల్లడించారు. 'అమ్మా.. నాన్న భద్రత విషయంలో మనం ఏదో ఒకటి చేయకపోతే, అతి త్వరలోనే ఆయన అంత్యక్రియలకు హాజరయ్యేందుకు తిరిగి రావాల్సి వస్తుందని నాకు అనిపిస్తోంది' అని రాహుల్ అప్పట్లో ఆందోళన వ్యక్తం చేసినట్లు సోనియా తెలిపారు.

తన తండ్రి భద్రతపై రాహుల్ ఎంతగా ఆందోళన చెందారో ఈ ఘటన తెలియజేస్తోంది.

ADVERTISEMENT

వివరాలు 

పుస్తకంలో ప్రస్తావించని విషయాలు.. రాహుల్ భావోద్వేగ వ్యాఖ్యలు

500 పేజీలకు పైగా ఉన్న తన తల్లి పుస్తకంలోనూ కొన్ని విషయాలను ఆమె ప్రస్తావించకుండా వదిలేశారని రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

రాజీవ్ గాంధీ భద్రతను ఉపసంహరించుకోవడం వెనుక ఒక ఉద్దేశం ఉందని వ్యాఖ్యానించారు.

2004లో తీసుకున్న ఒక నిర్ణయం తమలో కొందరికి ఉపశమనం కలిగించగా, మరికొందరికి ఆనందాన్ని ఇచ్చిందని రాహుల్ పేర్కొన్నారు.

తన తల్లి జ్ఞాపకాల ప్రయాణంలో అపారమైన ప్రేమతో పాటు తీవ్రమైన విషాదం కూడా ఉందని రాహుల్ అన్నారు.

జీవితంలో ఎదురైన కష్టాలు, విషాదకరమైన పరిస్థితులను సోనియా గాంధీ ఎంతో హుందాగా, ధైర్యంగా ఎదుర్కొన్నారని కొనియాడారు.

ADVERTISEMENT

వివరాలు 

భారత్‌లో తొలి రోజులు.. పేదరికం చూసి దిగ్భ్రాంతి

తన జీవితంలోని అనుభవాలు,జ్ఞాపకాల ఆధారంగా 'బిలాంగింగ్:ఎ జర్నీ ఆఫ్ లవ్' పుస్తకాన్ని రచించినట్లు సోనియా గాంధీ తెలిపారు.

ఈ పుస్తకానికి రాహుల్,ప్రియాంక తమ జ్ఞాపకాలను కూడా జోడించడంతో అందులోని సంఘటనలకు మరింత ప్రాణం వచ్చిందని చెప్పారు.

తన పిల్లలే తనకు జీవితంలో అతిపెద్ద ఆనందం,బలం అని పేర్కొన్నారు. అయితే తన సహనాన్ని అత్యధికంగా పరీక్షించేది కూడా వారేనని సరదాగా వ్యాఖ్యానించారు.

1968లో ఇటలీ నుంచి భారత్‌కు వచ్చిన తొలినాళ్లను కూడా ఈ సంభాషణలో సోనియా గుర్తుచేసుకున్నారు.

అప్పట్లో భారత్‌లో తాను చూసిన పేదరికం తీవ్రంగా కలచివేసిందని,ఆ పరిస్థితులు తనను దిగ్భ్రాంతికి గురిచేశాయని వెల్లడించారు.

తన జీవితంలో చోటుచేసుకున్న ప్రేమ, కుటుంబ అనుబంధాలు, విషాదాలు, భారత్‌లో తొలి అనుభవాలను ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు వివరించారు.

ADVERTISEMENT