
Rajkot gaming zone: రాజ్ కోట్ అగ్ని ప్రమాదం,27 మంది మృత్యువాత
ఈ వార్తాకథనం ఏంటి
గుజరాత్ రాష్ట్రంలోని రాజ్ కోట్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. టీఆర్పీ గేమ్ జోన్ లో మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో 27 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నారు. అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నాయి.
వారిని రక్షించేందుకు పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మృత్యుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని సమాచారం.
ఈ ఘటనపై గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కాగా టీఆర్పీ గేమ్ జోన్ కు అగ్నిమాపక విభాగపు అనుమతి లేదు. అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC)లేక పోవడం గమనార్హం.
Details
బాధితులు బైటికి రావడానికి దారేది?
గేమ్ జోన్ లో అగ్ని ప్రమాదం జరగగానే బయటికి వద్దామన్నా ఒక్కటే దారి వుంది. అది కూడా ఏడు అడుగుల ఎత్తులో వుండటంతో బయటకు రాలేకపోయారు.
గేమ్ జోన్ పరిధిలో జనరేటర్ల కోసం 3 వేల లీటర్ల డీజిల్ నిల్వ వుంచారు.రేస్ కార్ల కోసం ముందు జాగ్రత్తగా తెచ్చి వుంచారు.
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నారన్న చందంగా గుజరాత్ సర్కార్ తయారైంది.
ఈ దుర్ఘటనపై ఐదుగురు సభ్యులతో కూడిన SITను ఆ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
కాలి బూడిదైపోయిన శవాల డిఎన్ఎను సేకరించి బాధిత కుటుంబాలకు అందిస్తామన్నారు ఆ రాష్ట్ర హోంమంత్రి హరీష్ సంఘ్వీ .
ఈ ఘటనతో మేల్కొన్న గుజరాత్ DGP ..టీఆర్పీ గేమ్ జోన్ లన్నింటిపై నిఘా వుంచాలని ఆదేశించారు.
Details
27 మంది మృతి,నలుగురు పిల్లల గల్లంతు!
రాజ్‌కోట్ అగ్ని ప్రమాదంపై స్థానిక పోలీస్ కమిషనర్ రాజు భార్గవ మీడియాతో మాట్లాడారు.
ప్రస్తుతానికి 27 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ఆసుపత్రికి పంపామన్నారు.
ఈ గేమింగ్ జోన్ యువరాజ్ సింగ్ సోలంకి తో సహా మరో ఇద్దరిని అరెస్టు చేశామని వివరించారు.
సాయంత్రం 4.30 గంటలకు ప్రమాదం గురించి కాల్ వచ్చిందన్నారు రాజ్‌కోట్ కలెక్టర్ ప్రభావ్ జోషి .. కాగా మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటించించారు.
ఈ అగ్ని ప్రమాదంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Details
ఘటనపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి
ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.4 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిహారం అందజేస్తామని సీఎం తెలిపారు.
ఈ రాజ్‌కోట్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన అందరినీ బాధకు గురిచేసిందన్నారు.
ఈ ప్రమాదానికి సంబంధించి ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో మాట్లాడి సమాచారం తెలుసుకున్నాను.
ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అంందిస్తుంది" అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.
ఈ విషాద సమయంలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు.
గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.