
Rajya Sabha : నాకు పెళ్లెంది, కోపం రాదన్న చైర్మన్.. రాజ్యసభలో సరదా సంభాషణ
ఈ వార్తాకథనం ఏంటి
మణిపూర్ హింసాకాండ జ్వాలల నేపథ్యంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పార్లమెంట్‌లో గురువారం నవ్వులు విరిశాయి.
రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ మధ్య జరిగిన సంభాషణతో సభ్యులంతా పగలబడి నవ్వారు.
రాజకీయ నినాదాలకు కాసేపు విరామం ఇచ్చి, ఆనందించారు.
రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ రూల్ 267 కు ప్రాధాన్యం ఇస్తూ సభను వాయిదా వేసి, మణిపూర్ సమస్యలపై చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు.
బుధవారం రాజ్యసభ చైర్మన్‌ను కలిసినప్పుడు ఆయన ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు.
Details
తాను ఎప్పుడూ కోపంగా లేనన్న జగదీప్ ధన్‌కర్
దీంతో వెంటనే స్పందించిన చైర్మన్ జగదీప్ ధన్‌కర్.. తనకు పెళ్లి అయి 45 ఏళ్లు దాటిందని, తనను అంతా నమ్మాలని, తాను ఎప్పుడు కోపంగా లేనని చెప్పగానే సభ్యులంతా గట్టిగా నవ్వేశారు.
పీ.చిదంబరం గొప్ప సీనియర్ అడ్వకేట్ అని, ఓ సీనియర్ అడ్వకేట్‌గా కోపం ప్రదర్శించే హక్కు తమకు లేదని, ఈ స్టేట్ మెంట్ దయచేసి సవరించుకోవాలని ఆయన కోరాడు.
దీనిపై ఖర్గే స్పందిస్తూ మీరు కోపాన్ని ప్రదర్శించకపోయినా లోలోపల కోపంగా ఉంటారని చెప్పడంతో సభ్యులు మరోసారి నవ్వుకున్నారు.