Page Loader
ఫార్మసీ (సవరణ) బిల్లు - 2023కి గ్రీన్ సిగ్నల్.. విపక్షాల గందరగోళం మధ్య రాజ్యసభ ఆమోదం
విపక్షాల గందరగోళం మధ్య రాజ్యసభ ఆమోదం

ఫార్మసీ (సవరణ) బిల్లు - 2023కి గ్రీన్ సిగ్నల్.. విపక్షాల గందరగోళం మధ్య రాజ్యసభ ఆమోదం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 10, 2023
07:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఫార్మసీ (సవరణ) బిల్లు - 2023కి గురువారం రాజ్యసభలో ఆమోదం లభించింది. తాజాగా ఆమోదించిన బిల్లుతో ఫార్మసీ చట్టం -1948కి పలు సవరణలు జరిగాయి. జమ్మూకాశ్మీర్ ఫార్మసీ చట్టం- 2021 కింద నమోదైన లేదా అర్హత పొందిన వారికి సంబంధించి ప్రత్యేక నిబంధనలను ఈ బిల్లులో పొందుపర్చారు. ఉదయం సెషన్‌ వాయిదా తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి సమావేశమైంది. మణిపూర్ అల్లర్లపై ప్రత్యేక నియమం కింద చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుబట్టాయి. విపక్షాల గందరగోళం మధ్య ఫార్మసీ బిల్లుకు ఆమోద ముద్ర లభించింది. సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కోసం ఛైర్మన్ ప్రయత్నించినా వినిపించుకోలేదు.ఈ క్రమంలోనే సభ రేపటికి వాయిదా పడింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఫార్మసీ (సవరణ) బిల్లు - 2023కి రాజ్యసభ గ్రీన్ సిగ్నల్