
బీజేపీ ఎంపీ రామ్ శంకర్ కతేరియాకు రెండేళ్ల జైలుశిక్ష; అనర్హత వేటు పడే అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
2011లో జరిగిన దాడి కేసులో బీజేపీ ఎంపీ రామ్ శంకర్ కతేరియాకు ఆగ్రా కోర్టు శనివారం రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
కతేరియా 2011లో విద్యుత్ సరఫరా సంస్థ ఉద్యోగిపై దాడికి పాల్పడ్డారు. ఆగ్రా కోర్టు కతేరియాను దోషిగా తేలుస్తూ, రెండేళ్ల జైలు శిక్ష పడింది.
ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం కోర్టు తీర్పుతో కతేరియాపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. తద్వారా ఆయన తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోతారు.
ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా నుంచి సిట్టింగ్ ఆయన ఎంపీగా ఉన్నారు.
ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 ప్రకారం ఎన్నుకోబడిన ప్రతినిధికి రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఏదైనా నేరానికి శిక్ష పడితే, అతను తన పదవికి అనర్హుడవుతారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆగ్రా కోర్టు సంచలన తీర్పు
BJP MP from Etawah Ram Shankar Katheria, convicted for 2 years of imprisonment, by Agra court related to a case of assault in 2011. pic.twitter.com/vxIHIbuiyI
— 𝐃𝐎 𝐍𝐞𝐰𝐬 (@donewstoday) August 5, 2023