Page Loader
 Ramdular Gond: అసెంబ్లీ నుంచి రేపిస్ట్ బీజేపీ ఎమ్మెల్యే రామ్ దులార్‌ బహిష్కరణ
Ramdular Gond: అసెంబ్లీ నుంచి రేపిస్ట్ బీజేపీ ఎమ్మెల్యే రామ్ దులార్‌ బహిష్కరణ

 Ramdular Gond: అసెంబ్లీ నుంచి రేపిస్ట్ బీజేపీ ఎమ్మెల్యే రామ్ దులార్‌ బహిష్కరణ

వ్రాసిన వారు Stalin
Dec 23, 2023
05:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సోన్‌భద్రలో మైనర్‌పై అత్యాచారం కేసులో దోషిగా తేలిన దుద్ది బీజేపీ ఎమ్మెల్యే రామ్ దులార్‌ను అసెంబ్లీ సభ్యత్వం రద్దు అయ్యింది. ఈ మేరకు అసెంబ్లీ నుంచి రామ్ దులార్‌ను బహిష్కరిస్తూ అసెంబ్లీ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రదీప్ కుమార్ దూబే నోటిఫికేషన్ విడుదల చేశారు. డిసెంబర్ 15 నుంచి రామ్ దూలార్ అసెంబ్లీకి అనర్హులుగా పరిగణించబడతారని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దీంతో ఆ రోజు నుంచే యూపీలోని రామ్ దులార్ స్థానం ఖాళీగా ఉన్నట్లు వివరించారు. అత్యాచారం, పోక్సో చట్టం కింద 2014 నవంబర్‌లో రామ్‌దులార్ గోండ్‌పై కేసు నమోదైంది.

యూపీ

25 సంవత్సరాల జైలు శిక్ష

డిసెంబరు 15న, సోన్‌భద్ర (MP/MLA) ప్రత్యేక న్యాయస్థానం మైనర్‌పై అత్యాచారం చేసిన కేసులో రాందులర్ గోండ్‌ను దోషిగా తేల్చుతూ.. 25 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 10 లక్షల రూపాయల జరిమానా విధించింది. ప్రత్యేక న్యాయస్థానం తీర్పును సవాల్ చేస్తూ.. రామ్ దులార్‌ అలహాబాద్ హైకోర్టులో అప్పీల్ చేశారు. కానీ హైకోర్టులో ఎలాంటి ఉపశమనం లభించలేదు. అయితే ఈ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ కేసులో రికార్డనులను సమర్పించాలని ప్రత్యేక న్యాయస్థానంకు హైకోర్టు సమన్లు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని విపక్షాలకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ మయాంక్ కుమార్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు.