తదుపరి వార్తా కథనం

Yadagirigutta temple: యాదగిరిగుట్ట సేవలకు అరుదైన అంతర్జాతీయ గౌరవం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 01, 2025
08:55 am
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలోని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ సేవలకు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్వయంగా ఆలయ సేవలను అభినందించారు. ఈ మేరకు ఆలయ నిర్వాహకులకు ఆయన లేఖ రాసి శుభాకాంక్షలు తెలిపారు. కెనడాలోని ఒట్టావా నగరంలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో జరిగిన కల్యాణ మహోత్సవాన్ని మార్క్ కార్నీ ప్రత్యేకంగా ప్రశంసించారు.
Details
సేవలను మరింత విస్తృతం చేస్తాం
హిందూ సంస్కృతిలో ప్రతిబింబించే ఆధ్యాత్మికత, ఐక్యత ఎంతో గొప్పదని లేఖలో పేర్కొన్నారు. ఈ నెల 27 వరకు కెనడాలోని నాలుగు రాష్ట్రాల్లో స్వామివారి కల్యాణోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ లేఖపై రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, ఆలయ ఈవో వెంకట్రావు హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో స్వామివారి సేవలను మరింత విస్తృతం చేసి, భక్తులకు చేరువ చేస్తామని ఈవో వెంకట్రావు తెలిపారు.