LOADING...
Ratan Tata Innovation Hub: అమరావతిలో రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు 
అమరావతిలో రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు

Ratan Tata Innovation Hub: అమరావతిలో రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 20, 2025
12:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో నూతన ఆవిష్కరణలకు వేదికగా నిలిచే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌కు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మంగళగిరి సమీపంలోని మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌లు ఈ హబ్‌ను లాంఛనంగా ప్రారంభించారు. దాదాపు 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడుతున్న ఈ కేంద్రం, రానున్న రోజుల్లో స్టార్టప్‌లకు, నూతన ఆలోచనలకు మార్గదర్శిగా నిలవనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంకేతిక అవసరాలను తీర్చగల స్టార్టప్ కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు.

వివరాలు 

అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా తీర్చిదిద్దే దిశగా చర్యలు 

అమరావతిని కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, డీప్ టెక్, కృత్రిమ మేధ (Artificial Intelligence), సుస్థిరత, సమ్మిళిత ఆవిష్కరణలకు ప్రధాన వేదిక కానుంది. ఈ క్రమంలో అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపట్టనున్నారు. అంతేకాకుండా, భవిష్యత్‌లో ఆవిష్కరణ ఆధారిత ఆర్థిక వ్యవస్థలకు ప్రమాణంగా ఇది రూపుదిద్దుకోనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభను ఆకర్షించేందుకు, పెట్టుబడులను పెంపొందించేందుకు, అలాగే ఇన్నోవేషన్ ఆధారిత విధానాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఈ హబ్ ముఖ్య లక్ష్యం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు