
Rekha Gupta: ఆపరేషన్ సిందూర్‌పై జయాబచ్చన్ కీలక వ్యాఖ్యలు.. కౌంటర్ ఇచ్చిన దిల్లీ ముఖ్యమంత్రి
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత సాయుధ దళాలు చేపట్టిన ప్రతీకాత్మక చర్యకు'ఆపరేషన్ సిందూర్' అనే పేరు పెట్టడాన్ని బాలీవుడ్ నటిగా మారిన రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్ తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఆమె వ్యాఖ్యలపై తాజాగా దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీలో జరిగిన శాసనసభ సమావేశంలో,'ఆపరేషన్ సిందూర్'.'ఆపరేషన్ మహాదేవ్'లపై జరిగిన చర్చలో పాల్గొన్న రేఖా గుప్తా,జయా బచ్చన్ వ్యాఖ్యలపై ఘాటు విమర్శలు గుప్పించారు. ''భారత్ ఇటీవల పాక్‌పై చేపట్టిన సైనిక చర్యకు సిందూర్ అని ఎందుకు పేరు పెట్టారని జయా బచ్చన్ అడిగారు.ఆమె ప్రశ్నకు సినిమా భాషలోనే సమాధానం ఇవ్వాలనిపిస్తోంది.ఎందుకంటే ఆమెకు సినిమాల సంగతి తెలుసు,కానీ దేశ సమకాలీన పరిస్థితుల గురించి స్పష్టత లేదు,''అని ఆమె విమర్శించారు.
వివరాలు
దేశాన్ని ప్రేమించలేరు కానీ..
ఈ సందర్భంగా జాతీయ భద్రత అంశాన్ని ప్రతిపక్షాలు నెగిటివ్‌గా చూపించడాన్నికూడా రేఖా గుప్తా తప్పుబట్టారు. ''దేశాన్ని ప్రేమించలేరు కానీ,దేశ వ్యతిరేక శక్తుల పట్ల మాత్రం వీరికి మక్కువ ఉంటుంది.తమను భారతీయులమని చెప్పుకుంటూ.. వాస్తవానికి పాకిస్థాన్ తరఫున మాట్లాడతారు,'' అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పహల్గాం దాడికి భారత దళాలు 'ఆపరేషన్ సిందూర్'తో తగిన బదులు ఇచ్చాయని ఆమె స్పష్టం చేశారు. దీనివల్ల భారత సైనికుల ధైర్యం, ఆత్మబలం, దేశప్రేమ స్పష్టంగా చాటి చెప్పారన్నారు.
వివరాలు
సైనిక చర్యకు 'సిందూర్' పేరు పెట్టడం సరికాదు
ఇటీవల, జయా బచ్చన్ గతంలో పార్లమెంటులో మాట్లాడుతూ, ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడికి బదులుగా చేపట్టిన సైనిక చర్యకు 'సిందూర్' అని పేరు పెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే చాలా మంది మహిళలు తమ జీవితాల్లో సిందూరాన్ని కోల్పోతున్న తరుణంలో, అలాంటి పేరుతో ఆపరేషన్ ప్రారంభించడం భావోద్వేగాలను గాయపరిచేలా ఉందని ఆమె వాదించారు. ఆమె వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి.