Page Loader
Telangana: ప్రణాళికా శాఖ గణాంకాల సంకలనం విడుదల.. రంగారెడ్డి జిల్లా అగ్రస్థానం 
ప్రణాళికా శాఖ గణాంకాల సంకలనం విడుదల.. రంగారెడ్డి జిల్లా అగ్రస్థానం

Telangana: ప్రణాళికా శాఖ గణాంకాల సంకలనం విడుదల.. రంగారెడ్డి జిల్లా అగ్రస్థానం 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 18, 2025
09:18 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో భాగ్యనగరం కీలక పాత్ర పోషిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకు డిపాజిట్లలో సగానికిపైగా హైదరాబాద్‌లోనే ఉండటం గమనార్హం. 2024-25 మొదటి త్రైమాసికంలో మొత్తం బ్యాంకు డిపాజిట్లు రూ.7.69 లక్షల కోట్లుగా ఉంటే, అందులో హైదరాబాద్, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల పరిధిలో రూ.5.18 లక్షల కోట్లు ఉన్నాయి. ఇందులో హైదరాబాద్‌ జిల్లాకు రూ.4.62 లక్షల కోట్ల వాటా ఉంది. తలసరి ఆదాయ పరంగా రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో ఉండగా,హైదరాబాద్‌,మేడ్చల్‌ జిల్లాలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. జిల్లా స్థూల ఉత్పత్తి పరంగా రంగారెడ్డి జిల్లా ముందంజలో ఉండగా,హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉంది. సోమవారం రాష్ట్ర ప్రణాళికశాఖ విడుదల చేసిన తెలంగాణ గణాంకాల సంకలనం (అట్లాస్‌) నివేదికలో జనాభా,ఆర్థిక పరిస్థితి, విద్య సహా అనేక అంశాలను విశ్లేషించారు.

వివరాలు 

జనాభా, సామాజిక గణాంకాలు 

హైదరాబాద్‌ జిల్లాలో ఈ త్రైమాసికంలో రూ.4.63 లక్షల కోట్ల మేర రుణాలు మంజూరయ్యాయి. ఎస్సీ, ఎస్టీ జనాభా తక్కువగా ఉన్న జిల్లాల్లో హైదరాబాద్‌ మొదటి స్థానంలో ఉంది. జనసాంద్రత విషయానికి వస్తే, రాష్ట్ర సగటు జనసాంద్రత 312 కాగా, హైదరాబాద్‌లో ఇది 18,161.

వివరాలు 

నూతన వాహనాల నమోదు 

రాష్ట్రంలో కొత్తగా నమోదైన వాహనాల్లో 53% హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలకు చెందాయి. మొత్తం 9,76,073 వాహనాల్లో 5,18,375 వాహనాలు ఈ మూడు జిల్లాల్లోనే నమోదయ్యాయి. పోషకాహారం పంపిణీ సప్లిమెంటరీ పోషకాహారం తల్లులకు అందిన శాతం: 51.79% పిల్లలకు అందిన శాతం: 60.3%

వివరాలు 

రోడ్ల పరిస్థితి 

జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం రోడ్ల పొడవు: 9013 కిలోమీటర్లు, 2846 కిలోమీటర్లు బీటీ రోడ్లు, 6167 కిలోమీటర్లు సిమెంట్‌ కాంక్రీట్‌ రోడ్లు. విద్యుత్ వినియోగం అత్యధిక గృహ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్న జిల్లా: హైదరాబాద్‌ , వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు: 79 మాత్రమే విద్యా రంగం రాష్ట్రంలోని అత్యధిక పాఠశాలలు ఉన్న మూడు జిల్లాలు: రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి. రంగారెడ్డి జిల్లా: 2907 పాఠశాలలు - విద్యార్థులు 7.70 లక్షలు హైదరాబాద్: 2865 పాఠశాలలు - విద్యార్థులు 9.02 లక్షలు మేడ్చల్‌-మల్కాజిగిరి: 2070 పాఠశాలలు - విద్యార్థులు 7.67 లక్షలు