
Inflation: తెలుగు రాష్ట్రాలకు ఊరట.. మార్చిలో అతి తక్కువ ద్రవ్యోల్బణం!
ఈ వార్తాకథనం ఏంటి
మార్చి నెలలో దిల్లీ, ఝార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దేశంలోనే అతి తక్కువ ద్రవ్యోల్బణం నమోదైంది.
దేశవ్యాప్తంగా మార్చిలో సగటు ద్రవ్యోల్బణం 3.34 శాతంగా నమోదవగా, తెలంగాణలో ఇది కేవలం 1.06 శాతం మాత్రమే ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లో 2.50 శాతానికి పరిమితమైంది.
ఈ క్రమంలో తెలంగాణ మొదటి స్థానంలో, ఏపీ నాలుగో స్థానంలో నిలిచాయి. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 0.20 శాతంగా, పట్టణ ప్రాంతాల్లో 1.79 శాతంగా నమోదైంది.
ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో తెలంగాణలో ద్రవ్యోల్బణం మరింత తగ్గగా, ఏపీలో మాత్రం స్వల్పంగా పెరిగింది.
గత రెండు నెలలుగా అత్యల్ప ద్రవ్యోల్బణం గల రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు, అత్యధిక ద్రవ్యోల్బణంతో కేరళ తొలి స్థానంలో నిలిచింది.
Details
ఫిబ్రవరిలో అత్యల్ప ద్రవ్యోల్బణం
ఫిబ్రవరిలో అత్యల్ప ద్రవ్యోల్బణం గల రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉండగా.. మార్చిలో అది నాలుగో స్థానానికి చేరింది.
మొత్తం మీద, దేశవ్యాప్తంగా మార్చిలో ద్రవ్యోల్బణం 27 బేసిస్ పాయింట్లు తగ్గింది. ఇది 2019 ఆగస్టు తర్వాత కనిష్ఠంగా నమోదైన స్థాయి కావడం విశేషం.
మార్చిలో కూరగాయలు, గుడ్లు, పప్పుధాన్యాలు, మాంసం, చేపలు, చిరుధాన్యాలు, పాలు, పాల ఉత్పత్తుల ధరలు తగ్గడం వల్ల ద్రవ్యోల్బణం తగ్గినట్లు కేంద్ర గణాంకాలశాఖ వెల్లడించింది.
గతేడాది మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చి నాటికి కొబ్బరి నూనె, కొబ్బరి, బంగారం, వెండి, ద్రాక్షలకు అధిక ద్రవ్యోల్బణం నమోదైనప్పటికీ.. అల్లం, టమాటా, కాలీఫ్లవర్, జీలకర్ర, వెల్లుల్లి వంటి వస్తువులకు మాత్రం అత్యల్ప ద్రవ్యోల్బణం నమోదు కావడం గమనార్హం.