
తమిళనాడు: విద్యాలయాలకు మళ్లీ వేసవి సెలవుల పొడిగింపు
ఈ వార్తాకథనం ఏంటి
స్కూల్ పిల్లలకు సంబంధించిన అంశంపై తమిళ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో ఇంకా భయంకరమైన ఎండలు కొనసాగుతుండటం వల్ల పాఠశాలలకు ఇచ్చిన వేసవి సెలవులను అక్కడి ప్రభుత్వం పొడిగించింది.
గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఈ కింది తరగతుల వారికి ఇలా పొడిగింపు ఇచ్చారు.
జూన్ 1న : ఆరో తరగతి నుంచి పదో తరగతి,
జూన్ 5న : ఒకటో తరగతి నుంతి ఐదో తరగతి
అయితే ఈ మేరకు పాఠశాలలు రీ ఓపెన్ అవ్వాల్సింది.
కానీ తమిళనాడు వ్యాప్తంగా వేసవి వేడి సెగలు ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో తాజాగా సెలవులను పొడిగించింది తమిళనాడు ప్రభుత్వం.
qwqw
ఓ వైపు ఎండల వేడి, మరోవైపు వర్షాల లేమితోనే పొడిగింపు
తమిళనాడులో ఓ వైపు భానుడు నిప్పులు చిమ్మడం ఆగకపోవడం, మరోవైపు నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఈ నెల 11 వరకు సమ్మర్ హాలీడేస్ ను పొడిగిస్తున్నామని ముఖ్యమంత్రి స్టాలిన్ స్పష్టం చేశారు.
2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి 6 నుంచి 10 తరగతులతో పాటు ఇంటర్ విద్యార్ధులకు జూన్ 12న,
1-5 తరగతులకు జూన్ 14న విద్యాలయాలు పున ప్రారంభం కానున్నట్లు వివరించారు.
రీ ఓపెన్ తేదీలు :
జూన్ 12న : 6 నుంచి 10 తరగతులతో పాటు ఇంటర్ విద్యార్ధులకు రీ ఓపెన్
జూన్ 14న : 1 - 5 తరగతుల చిన్నారులకు కొత్త తరగతులు ప్రారంభం.