తదుపరి వార్తా కథనం

కొడంగల్‌లో రేవంత్ రెడ్డి గెలుపు, పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి ఓటమి
వ్రాసిన వారు
Stalin
Dec 03, 2023
01:37 pm
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది.
కొడంగల్‌లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విజయం సాధించారు.
32వేల ఓట్ల మెజార్టీతో పట్నం నరేందర్ రెడ్డిపై రేవంత్ నెగ్గారు.
అలాగే బీఆర్ఎస్ పాలకుర్తి అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరాజయం పాలయ్యారు.
ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి యశస్వనీ రెడ్డి చేతిలో ఓటమి చెందారు.
మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ సమీప బీఆర్ఎస్ అభ్యర్థి పద్మ దేవేందర్ రెడ్డి పై విజయం సాధించారు.
బాన్సువాడలో పోచారం శ్రీనివాస రెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డిపై 23,582 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
32800 తేడాతో రేవంత్ విజయం
కొడంగల్ లో 32800 మెజారిటీతో రేవంత్ రెడ్డి విజయం 💥💥#RevanthReddy pic.twitter.com/3mlV9RQo5d
— 𝗦𝗵𝗶𝘃𝘂𝗱𝘂 (@Shiva4TDP) December 3, 2023