91ఎఫ్‌ఎం ట్రాన్స్‌మీటర్ల ప్రారంభంతో రేడియో పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు: ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 91 కొత్త ఎఫ్ఎం ట్రాన్స్‌మిటర్‌లను ప్రారంభించారు.
91ఎఫ్‌ఎం ట్రాన్స్‌మీటర్ల ప్రారంభం అనేది దేశంలో రేడియో పరిశ్రమలో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
ఆల్ ఇండియా రేడియో అనేది ఆల్ ఇండియా ఎఫ్‌ఎమ్‌గా మారుతోందన్నారు. ఎఫ్‌ఎం సేవల విస్తరణలో ఎఫ్‌ఎం ట్రాన్స్‌మిటర్ల ప్రారంభం అనేది కీలకమైన ముందడుగుగా పేర్కొన్నారు.
రేడియో ద్వారా నిర్వహించే మన్ కీ బాత్ ద్వారా తాను దేశ ప్రజలతోనే ఉన్నట్లు మోదీ చెప్పారు.
ఒక విధంగా చెప్పాలంటే తాను కూడా ఆల్ ఇండియా రేడియో టీమ్‌లో భాగంగా వెల్లడించారు.
ప్రధానమంత్రి
తెలంగాణలో 4ఎఫ్‌ఎమ్ ట్రాన్స్‌మిటర్ల ఏర్పాటు
డిజిటల్ ఇండియా రేడియోకి కొత్త శ్రోతలను అందించడమే కాకుండా కొత్త ఆలోచనా విధానాన్ని కూడా అందిస్తోందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
బీజేపీ ప్రభుత్వం సాంస్కృతిక అనుసంధానంతో పాటు మేధో సంబంధాన్ని బలోపేతం చేస్తోందన్నారు. కనెక్టివిటీ అనేది దేశంలోని 140కోట్ల మంది పౌరులను కలిపేలా ఉండాలని మోదీ అన్నారు.
91ఎఫ్‌ఎం ట్రాన్స్‌మీటర్ల ప్రారంభం అనేది దేశంలో రేడియో కనెక్టివిటీకి మరింత ఊతం ఇస్తుందని స్పష్టంచేశారు.
18రాష్ట్రాల్లో ప్రధాని మోదీ 85 జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఎఫ్‌ఎమ్ ట్రాన్స్‌మిటర్లను ప్రారంభించారు. ఇందులో తెలంగాణలో నాలుగు ఉన్నాయి. సిర్పూర్, నల్గొండ, దేవరకొండ, రామగుండంలో ఏర్పాటు చేశారు.
కొత్తగా ప్రారంభించిన ఎఫ్‌ఎమ్ ట్రాన్స్‌మిటర్లు 2కోట్ల మంది దేశ ప్రజలకు కానుక లాంటిదని మోదీ చెప్పారు.