Page Loader
LOC : ఎల్ఓసీ వద్ద పెరుగుతున్న ఉద్రిక్తతలు.. ఐదుగురు సైనికులు మృతి
ఎల్ఓసీ వద్ద పెరుగుతున్న ఉద్రిక్తతలు.. ఐదుగురు సైనికులు మృతి

LOC : ఎల్ఓసీ వద్ద పెరుగుతున్న ఉద్రిక్తతలు.. ఐదుగురు సైనికులు మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 13, 2025
01:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత సైనిక స్థావరాలపై పాకిస్తాన్ సైన్యం పూంచ్ జిల్లాలోని బాలకోట్ సెక్టార్‌లో నిన్న కాల్పులు జరిపింది. దీనికి ప్రతిస్పందనగా, భారత సైన్యం కూడా పా ఎదురు కాల్పులు జరిపింది. ఈ దాడిలో పాకిస్తాన్‌ ఆర్మీకి చెందిన పలువురు సైనికులు గాయపడగా, అందులో ఐదుగురు మరణించారు. వారం రోజులుగా పాకిస్తాన్, నియంత్రణ రేఖ ద్వారా ఉగ్రవాదులను చొరబాట్లకు ప్రయత్నిస్తోంది. భారత సైన్యం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తూ, ప్రతి కుట్రను అడ్డుకుంటోంది. పాకిస్థాన్ నిరంతర కుట్రల దృష్ట్యా, జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ రోజు జమ్మూలో ఉన్నత స్థాయి భద్రతా సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో జమ్మూ కాశ్మీర్ డీజీపీ నళిన్ ప్రభాత్, పోలీసు ఉన్నతాధికారులు, జమ్మూ ఐజిపి పాల్గొననున్నారు.

Details

కెప్టెన్ కరమ్‌జిత్ సింగ్ మరణం

భద్రతా అధికారుల ప్రకారం, పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి భారత సైనికులపై జరిగిన కాల్పులకు భారత సైన్యం సమర్థవంతమైన ప్రతిస్పందన ఇచ్చింది. కృష్ణ ఘాటి సెక్టార్‌లో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో, జమ్మూ జిల్లాలోని అఖ్నూర్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ సమీపంలో ఉగ్రవాదులు అమర్చిన IED పేలుడులో, ఒక కెప్టెన్‌తో పాటు మరో సైనికుడు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం జరిగిన ఈ పేలుడులో కెప్టెన్ కరమ్‌జిత్ సింగ్, నాయక్ ముఖేష్ సింగ్ అమరులయ్యారు. మరో సైనికుడు గాయపడ్డాడు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉండటంతో, ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ పేలుడు ఉగ్రవాదుల పన్నాగమేనని భావిస్తున్నారు.