Kolkata Doctor Murder Case:ఆర్జీకర్ వైద్యురాలి కేసు.. మృతురాలి తల్లిదండ్రుల పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
కోల్‌కతాలోని ఆర్జీకర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలి హత్యాచారం కేసు గతేడాది దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.
ఈ కేసులో మళ్లీ సీబీఐ విచారణ జరిపించాలని మృతురాలి తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
అయితే సుప్రీంకోర్టు తాజాగా ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ కేసును హైకోర్టులో కొనసాగించొచ్చని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా సూచించారు.
గతేడాది ఆగస్టు 9వ తేదీన రాత్రి, ఆర్జీకర్ ఆసుపత్రిలోని సెమినార్ రూమ్‌లో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్ వైద్యురాలి పై అత్యాచారం జరిపి హత్య చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు సంజయ్ రాయ్‌ను అరెస్ట్ చేశారు. సాక్ష్యాధారాల ఆధారంగా న్యాయస్థానం అతడిని దోషిగా తేల్చి జీవితఖైదు శిక్ష విధించింది.
Details
సంజయ్ రాయ్ వాదన
తాను ఈ నేరానికి పాల్పడలేదని, ఎటువంటి ఆధారాలు లేకుండానే తనను ఇరికించారని సంజయ్ రాయ్ కోర్టులో వాదించాడు.
అయితే కోర్టు అతని వాదనను తిరస్కరించి, జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించింది.
కోర్టులో దాఖలైన అప్పీళ్లు
ట్రయల్ కోర్టు ఇచ్చిన జీవితఖైదు తీర్పును సవాలు చేస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే హైకోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించింది.
మరోవైపు ఈ కేసుపై సీబీఐ చేసిన అప్పీల్‌ను మాత్రం హైకోర్టు అంగీకరించింది.
Details
సుప్రీంకోర్టు తాజా నిర్ణయం
మృతురాలి తల్లిదండ్రులు కేసు పునర్విచారణ కోరుతూ అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
గతంలో సుప్రీంకోర్టు దీనిని విచారణకు తీసుకోలేదు.
తాజాగా సీబీఐ విచారణ కోల్పోతే, కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించాల్సిందిగా సూచించింది.