Page Loader
Road Accident: లారీ భీబత్సం.. బైక్‌ను ఈడ్చుకెళ్లి....వీడియో వైరల్ 
లారీ భీబత్సం.. బైక్‌ను ఈడ్చుకెళ్లి....వీడియో వైరల్

Road Accident: లారీ భీబత్సం.. బైక్‌ను ఈడ్చుకెళ్లి....వీడియో వైరల్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 18, 2024
11:07 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ లో ఓ లారీ బీభత్సాన్ని సృష్టించింది.ఒక బైక్ ను ఢీ కొట్టి ఆపకుండా బైకుతో పాటు మనిషిని కూడా కొద్దిదూరం ఈడ్చుకు కెళ్ళింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హిట్ అండ్ రన్ కేసులో ట్రక్కు డ్రైవర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. అరెస్టయిన ట్రక్కు డ్రైవర్‌ను పృథ్వీరాజ్‌గా గుర్తించినట్లు వారు తెలిపారు.ఈఘటన ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..మొదట ఓ కారును ఢీ కొట్టిన లారీ డ్రైవర్ అక్కడి నుండి తప్పించుకుంటున్న తరుణంలో మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. దాంతో స్థానికులు కొడతారన్న భయంతో లారీని ఆపకుండా వేగం పెంచి దాదాపు రెండు కి.మీ మేరకు వరకు వెళ్లాడు.

Details

బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు

ఈ సంఘటనలో ద్విచక్రవాహనదారుడు హఫీజ్ ప్రాణాలు కాపాడుకునేందుకు లారీ బ్యానట్ ఎక్కి ఆపాలంటూ ఎంత అరిచినా దాన్ని డ్రైవర్ వినకుండా ముందుకు వెళ్లాడు. ఈ సంఘటన సమయంలో అటువైపుగా వెళ్తున్న కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది కాస్త వైరల్ గా మారింది. కొంతమంది బైకర్స్ లారీని వెంబడించగా ఎల్బీనగర్ వైపు వెళ్లి చివరికి వనస్థలిపురం వద్ద లారీని ఆపేశాడు. ఆ తర్వాత డ్రైవర్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.