APSRTC: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు..
ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ బలోపేతం దిశగా త్వరలో ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఆదివారం, ఆయన రాజమహేంద్రవరం డిపో వద్ద ప్రారంభించిన 23 కొత్త బస్సులలో ఇంద్ర, సూపర్ లగ్జరీ, ఆల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు ఉన్నాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం కొత్తగా 1,400 బస్సులను కొనుగోలు చేసి, వాటిలో 600 బస్సులను ఇప్పటికే ప్రారంభించామన్నారు. మిగిలిన 800 బస్సులను మూడు నెలల్లో ప్రారంభిస్తామని చెప్పారు.
ప్రభుత్వంల ఆర్టీసీని విలీనం చేసినా సమస్యలు పరిష్కరించలేదు
గత వైసీపీ పాలనలో ఆర్టీసీ నిర్వీర్యమైందని, అప్పటి ముఖ్యమంత్రి, మంత్రులు ఆర్టీసీ స్థలాలను తమకు అనుకూలంగా ఉన్నవారికి కట్టబెట్టడానికే శ్రద్ధ చూపారని మంత్రి ఆరోపించారు. ప్రభుత్వంల ఆర్టీసీని విలీనం చేసినా సమస్యలు పరిష్కరించలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి,ఆదిరెడ్డి శ్రీనివాస్,నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మద్దిపాటి వెంకటరాజు,కలెక్టర్ ప్రశాంతి,ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.