LOADING...
Crackers: దీపావళి పటాకుల విక్రయం.. లైసెన్స్ కోసం 26లోగా దరఖాస్తు చేసుకోండి
దీపావళి పటాకుల విక్రయం.. లైసెన్స్ కోసం 26లోగా దరఖాస్తు చేసుకోండి

Crackers: దీపావళి పటాకుల విక్రయం.. లైసెన్స్ కోసం 26లోగా దరఖాస్తు చేసుకోండి

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 12, 2024
11:47 am

ఈ వార్తాకథనం ఏంటి

దీపావళి పండుగను పురస్కరించుకుని తాత్కాలిక పటాకుల విక్రయ దుకాణాల లైసెన్స్‌ల కోసం ఈ నెల 26వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌ పేర్కొన్నారు. 26వ తేదీ తరువాత దరఖాస్తులు స్వీకరించమని ఆయన స్పష్టం చేశారు. దరఖాస్తులను పరిశీలించి ఆయా డీసీపీల ద్వారా లైసెన్స్‌లు జారీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి, డివిజనల్‌ ఫైర్‌ ఆఫీసర్‌ నుంచి ఎన్ఓసీ, ప్రభుత్వ స్థలం అయితే బల్దియా నుంచి ఎన్ఓసీ, ప్రైవేట్‌ స్థలం అయితే యాజమాన్యాల నుంచి ఎన్ఓసీ, అగ్రిమెంట్‌ కాపీలను అందించాలని వివరించారు.

Details

నిబంధనలను పాటించాలి

గత ఏడాది జారీ చేసిన లైసెన్స్ ఉంటే దాని కాపీని కూడా దరఖాస్తుకు జోడించాలన్నారు. అదనంగా, సింగిల్‌ దుకాణం ఉంటే పక్క వారితో ఎన్ఓసీ తీసుకోవడం, షాప్ సైట్ ప్లాన్, రూ.600 లైసెన్స్ ఫీజును గన్‌పౌండ్రీలోని ఎస్‌బీహెచ్‌లో హెడ్ అకౌంట్‌లో జమ చేయాల్సి ఉంటుందని సూచించారు. ఈ డాక్యుమెంట్లు లేకుంటే దరఖాస్తులను తిరస్కరించాల్సి వస్తుందని కమిషనర్‌ తెలిపారు. లైసన్సుదారులు ఈ విషయాన్ని గమనించుకోవాలన్నారు.