Page Loader
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం..ఆగి ఉన్న లారీని ఢీకొన్న వ్యాన్..ఆరుగురు మృతి 
Write caతమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం..ఆగి ఉన్న లారీని ఢీకొన్న వ్యాన్..ఆరుగురు మృతి ption here

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం..ఆగి ఉన్న లారీని ఢీకొన్న వ్యాన్..ఆరుగురు మృతి 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 06, 2023
08:57 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడులోని సేలంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. తమిళనాడులోని సేలం-ఈరోడ్ హైవేపై తెల్లవారుజామున 4 గంటల సమయంలో వేగంగా వస్తున్న వ్యాన్ అదుపుతప్పి నిలబడి ఉన్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఈంగుర్‌కు చెందిన ఎనిమిది మంది సభ్యులు వ్యాన్‌లో పెరుంతురై వైపు వెళుతున్నారు. మృతులు సెల్వరాజ్, మంజుల, ఆరుముగం, పళనిసామి, పాపతి, ఏడాది పాపగా గుర్తించారు. సమాచారం అందుకున్న సేలం ఎస్పీ అరుణ్ కపిలన్, సంగకిరి డీఎస్పీ రాజా,తహశీల్దార్ ఇదుడై నంబి ప్రమాద స్థలాన్ని సందర్శించారు. ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ విఘ్నేష్,మరో ప్రయాణికురాలు ప్రియ తీవ్రంగా గాయపడగా,వారిని ఆస్పత్రికి తరలించారు. మరోవైపు మృతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

Twitter Post