Sammakka Saralamma Tribal University : ములుగు గిరిజన వర్సిటీకి లోక్‌సభ ఆమోదం
తెలంగాణలోని ములుగులో ఏర్పాటు చేయనున్న సమ్మక్క-సారక్క ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు లోక్‌సభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సభలో బిల్లు ఆమోదం తెలిపింది. కేంద్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం సంబంధిత బిల్లును కేంద్రం సోమవారం లోక్‌సభ ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బిల్లును ప్రవేశపెట్టారు. ఇందుకోసం కోసం రూ. 889.07 కోట్లు ఖర్చుపెట్టనున్నారు. అక్టోబర్'లో జరిగిన కేబినెట్ సమావేశంలో కేంద్రం ఈ వర్సిటీ ఏర్పాటుకు ఓకే చెప్పేసింది. యూనివర్సిటీ ఏర్పాటుకు స్ఠలం కోసం ములుగు సమీపంలో దాదాపు 200 ఎకరాలను గతంలోనే కేటాయింపులు జరిగాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు సైతం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు అనుకూలమని స్పష్టం చేశారు.