Page Loader
Satyendar Jain: మనీలాండరింగ్ కేసులో ఆప్ నేత సత్యేందర్ జైన్‌కు బెయిల్ 

Satyendar Jain: మనీలాండరింగ్ కేసులో ఆప్ నేత సత్యేందర్ జైన్‌కు బెయిల్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 18, 2024
04:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

మనీలాండరింగ్‌ కేసులో ఆప్‌ సీనియర్‌ నేత సత్యేందర్‌ జైన్‌కు పెద్ద ఊరట లభించింది. మాజీ మంత్రి అయిన సత్యేందర్‌ జైన్‌కు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం బెయిల్‌ మంజూరు చేసింది. ఆయనపై మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద నమోదైన కేసులో దాదాపు 18 నెలల పాటు జైలులో ఉన్నారు. సత్యేందర్‌ జైన్‌ నిర్బంధంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జైన్‌ సుధీర్ఘ కాలం నిర్బంధంలో ఉన్నారని పేర్కొంది. ఈ సందర్భంగా, ఆప్‌ నేత మనీష్‌ సిసోడియా కేసులో సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ, సత్వర విచారణ ప్రాథమిక హక్కుగా ఉందని వెల్లడించింది.

వివరాలు 

బెయిల్ పొందిన మూడో ఆప్‌ నేతగా సత్యేందర్‌ జైన్‌ 

జైన్‌ను మే 2022లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అరెస్ట్‌ చేసింది. ఆరోగ్య కారణాల వల్ల 2023 మేలో సుప్రీంకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ ఏడాది మార్చిలో సాధారణ బెయిల్ కోసం ఆయన చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో జైన్‌ తిరిగి ఢిల్లీకి తీహార్ జైలుకు చేరాడు. ఇటీవల కాలంలో వివిధ కేసుల్లో బెయిల్ పొందిన మూడో ఆప్‌ నేతగా సత్యేందర్‌ జైన్‌ నిలుస్తున్నారు. లిక్కర్‌ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు గత నెలలో బెయిల్ మంజూరు అయిన విషయం తెలిసిందే. అంతేకాక, ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఆగస్టులో బెయిల్ లభించింది.