LOADING...
SBI Bank Robbery: కర్ణాటక ఎస్‌బీఐ బ్యాంక్ లో59 కిలోల బంగారం,8 కోట్ల నగదు లూటీ
కర్ణాటక ఎస్‌బీఐ బ్యాంక్ లో59 కిలోల బంగారం,8 కోట్ల నగదు లూటీ

SBI Bank Robbery: కర్ణాటక ఎస్‌బీఐ బ్యాంక్ లో59 కిలోల బంగారం,8 కోట్ల నగదు లూటీ

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 17, 2025
09:54 am

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటకలోని విజయపుర జిల్లాలోని ఎస్‌బీఐ బ్యాంక్ శాఖలో భారీ దోపిడీ జరిగింది. చడ్చనా పట్టణంలో ఉన్న ఆ శాఖకు ముసుగులు ధరించిన దుండగులు తుపాకులు, ఇతర ఆయుధాలతో వచ్చి సిబ్బందిని భయపెట్టి 50కిలోల బంగారం,రూ.8కోట్ల నగదు దోచుకెళ్లారు. మంగళవారం సాయంత్ర సమయంలో దొంగలు ఒక్కసారిగా బ్యాంకులోకి చొరబడి ఉద్యోగులను బంధించి,యథేచ్ఛగా దోపిడీ నిర్వహించి పరారయ్యారు. నిందితులు వాడిన కారు పంధర్‌పుర్‌ ప్రాంతానికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కర్ణాటకతో పాటు మహారాష్ట్రలోనూ విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యక్ష సాక్ష్యాల ప్రకారం,దొంగలు మిలిటరీ యూనిఫామ్‌లను పోలిన ప్రత్యేక దుస్తులు ధరించి ఉన్నట్లు తెలుస్తోంది. దోపిడీ సమయంలో బ్యాంక్ మేనేజర్ అలారం బెల్‌ను నొక్కకుండా ఆయుధాలతో బెదిరించి దోపిడీ చేపట్టినట్టు తెలుస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

Twitter Post