
Arvind Kejriwal: సుప్రీంలో అరవింద్ కేజ్రీవాల్ కి ఊరట.. జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు
ఈ వార్తాకథనం ఏంటి
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం నిమిత్తం జూన్ 1 వరకు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది.
ఓట్ల లెక్కింపు వరకు తనకు బెయిల్ మంజూరు చేయాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.
అయితే సుప్రీంకోర్టు అతని అభ్యర్థనను తిరస్కరించింది,జూన్ 2న లొంగిపోవాలని ఆదేశించింది.
మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
అంతకుముందు ఈ కేసులో విచారణకు రావాలంటూ దర్యాప్తు సంస్థ తొమ్మిదిసార్లు సమన్లు జారీ చేసింది.
వాటికి స్పందించకపోవడంతో అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన తిహార్ జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉంటున్నా
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జూన్ 1 వరకు అరవింద్ కేజ్రీవాల్ కి ఊరట..
Delhi Chief Minister and Aam Aadmi Party (AAP) Chief Arvind Kejriwal has got a big relief from the Supreme Court. The Supreme Court on Friday (May 10) granted interim bail to Kejriwal till June 1. Delhi CM had filed a petition in the court for granting interim bail for the Lok… pic.twitter.com/3Bvj5wxM8q
— RTV (@RTVnewsnetwork) May 10, 2024