Page Loader
Supreme court: ఎన్నికల ఉచితాలపై సుప్రీంలో పిటిషన్‌.. ఈసీకి నోటీసులు
ఎన్నికల ఉచితాలపై సుప్రీంలో పిటిషన్‌.. ఈసీకి నోటీసులు

Supreme court: ఎన్నికల ఉచితాలపై సుప్రీంలో పిటిషన్‌.. ఈసీకి నోటీసులు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 15, 2024
01:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలపై ఓ పిటిషన్‌ అత్యున్నత న్యాయస్థానంలో ఓ పిటిషన్‌ దాఖలైంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి, భారత ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌ బెంగళూరుకు చెందిన ఒక న్యాయవాది సుప్రీం కోర్టులో దాఖలు చేశారు. ఇందులో రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఇచ్చే ఉచిత హామీలను లంచాలుగా పరిగణించాలని కోరారు. అలాగే, ఈ ఉచిత హామీలు ప్రజాస్వామ్య విధానానికి హాని కలిగిస్తాయంటూ అభిప్రాయపడ్డారు. సుప్రీం కోర్టు నుంచి ఎన్నికల సంఘానికి ఆదేశాలు రావాలని, తద్వారా ఎన్నికల ముందు పార్టీలు ఉచిత వాగ్దానాలు చేయకుండా చర్యలు తీసుకోవాలని ఈ పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు.

వివరాలు 

ఉచిత హామీల వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం

పిటిషన్‌లో ముఖ్యంగా ఉచిత హామీల వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరుగుతోందని, ఇది ప్రజాస్వామ్య విధానంలో అనైతికమని పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను పరిశీలించేందుకు సిద్ధమైంది. ఇదే తరహా పలు పిటిషన్లతో కలిపి దీనిపై విచారణ చేయాలని కోర్టు నిర్ణయించింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది విజయ్‌ హన్సారియా అత్యవసర విచారణ కోరుతూ, ఉచిత వాగ్దానాలు ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, అలాగే ఎన్నికల స్వచ్ఛతను దెబ్బతీస్తున్నాయని న్యాయస్థానంలో వాదనలు వినిపించారు.